telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

“జబర్దస్త్” వినోద్ ఒరిజినల్ ఐడెంటిటీ… ట్రాన్స్‌జెండర్‌గా మారబోతున్నాడా ?

Vinod

“జబర్దస్త్” కామెడీ షోలో వినోదినిగా పాపులర్ అయిన హాస్య నటుడు వినోద్. తాజాగా తన ఒరిజినల్ ఐడెంటిటీ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తాజాగా ఓ యూట్యూబ్ చానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో వినోద్ ఈ వివరాలు వెల్లడించాడు. తన ఆరోగ్యం గురించి ప్రస్తావిస్తూ.. త్వరలోనే తిరిగి జబర్దస్త్‌తో జాయిన్ అవుతానని చెప్పాడు. తనపై దాడి జరిగిన సమయంలో జబర్దస్త్ సభ్యులు ఇచ్చిన సహకారం మరువలేనిది అని గుర్తు చేసుకున్నాడు. ప్రతీ ఒక్కరూ తనకు అండగా నిలిచారని అన్నాడు. జబర్దస్త్‌తో పాటు సినిమాల్లోనూ నటిస్తున్నానని, రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ కెరీర్ కొనసాగిస్తున్నానని తెలిపాడు. ఇక జబర్దస్త్‌లో తాను వేసే లేడీ గెటప్‌‌‌ను చూసి తాను ట్రాన్స్‌జెండర్ అనుకునేవాళ్లకు సమాధానం చెప్పాడు. తాను ట్రాన్స్‌జెండర్ కాదని, తన ఒరిజినల్ ఐడెంటిటీ వినోద్ అని చెప్పాడు. తన జీవితమంతా వినోద్ గానే కొనసాగుతాను తప్ప, ట్రాన్స్‌జెండర్‌గా మారే ఆలోచనే లేదన్నాడు. వినోదిని అనేది కేవలం క్యారెక్టర్ మాత్రమేనని, అది జబర్దస్త్‌కు మాత్రమే పరిమితం అని చెప్పారు. లేడీ గెటప్‌లో ఆడియెన్స్‌ను మెప్పించడానికి పెర్ఫామెన్స్‌పై కాస్త ప్రత్యేక శ్రద్ద పెడుతానని చెప్పాడు. లేడీ గెటప్‌ కోసమే చేతి గోళ్లు కూడా పెంచుకున్నానని, అంతే తప్ప వేరే ఉద్దేశం లేదని తెలిపాడు.

Related posts