telugu navyamedia
సినిమా వార్తలు

రోజా, నాగబాబు గొడవ… వీడియో వైరల్

Roja-and-Nagababu

రోజా, నాగబాబు నిజంగానే గొడవ పడుతున్నారు. దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. “జబర్దస్త్” అనే బుల్లితెర కామెడీ షోకు వీరిద్దరూ జడ్జీలుగా వ్యవహరిస్తున్నారు. అయితే గత కొంతకాలంగా రోజా ఈ షోను వీడనుందనే వార్తలు కూడా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో రోజా, నాగబాబు మధ్య గొడవ వీడియో వైరల్ అవుతోంది. అయితే ఈ గొడవంతటికీ కారణం ఏంటంటే… ఓ బుల్లితెర కార్యక్రమం. ఓ కార్యక్రమం కోసం నాగబాబు, రోజా ఇలా గొడవ పడుతున్నారు. సాధారణంగా ప్రతీ పండక్కి ఈటీవీలో ఓ షో చేయడం ఆనవాయితీగా మారింది. తాజాగా వినాయక చవితి కోసం మరో ప్రోగ్రామ్ చేస్తున్నారు. అందులో భాగంగానే దానికి ఔను వాళ్లిద్దరూ గొడవ పడ్డారు అంటూ ఓ ప్రోమో విడుదల చేసారు. అక్కడ నాగబాబు, రోజా ఉన్నారు. “నా నవ్వు బాగుంటుందా.. లేక నీ నవ్వు బాగుంటుందా?” అంటూ డైలాగులతో ఈ వార్ మొదలవుతుందన్నమాట. అక్కడ్నుంచి ప్రోగ్రామ్ మొదలవుతుంది. అందులో ఎప్పట్లాగే జబర్దస్త్ కమెడియన్లతో పాటు ప్రదీప్, రవి లాంటి వాళ్ళు కూడా వచ్చి సందడి చేసారు. ఎప్పట్లాగే ఈ కార్యక్రమం కూడా సూపర్ హిట్ అవుతుందని నమ్ముతున్నారు నిర్వాహకులు. అందులో భాగంగానే నాగబాబు, రోజా పడుతూ కన్పించారు.

Related posts