తనకు ఆల్రెడీ ఎంగేజ్‌మెంట్ కూడా అయిపోయిందని ఆ మధ్య శ్రావణ మాసంలో పెళ్లి జరగాల్సినా దాడి జరగడంతో ఆగిపోయిందని చెప్పాడు జబర్దస్త్ కమెడియన్ వినోద్. తాను మానసికంగా, శారీరకంగా ధృడంగా అయిన తర్వాత ఈ ఫెళ్లి గురించి ఆలోచిస్తానంటున్నాడు వినోద్. ఈ విషయం పూర్తైపోయిన తర్వాతే పెళ్లి అంటున్నాడు ఈ కమెడియన్. అన్నీ కుదిరిన తర్వాత మరోసారి మంచి ముహూర్తం పెట్టుకుంటామని చెప్పాడు వినోద్. ఇదిలా ఉంటే తనను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి తమ బంధువే అని ఓపెన్ అయ్యాడు ఈయన. చిన్నప్పటి నుంచి చూస్తోంది కాబట్టి భవిష్యత్తులో కూడా తన నుంచి ఎలాంటి సమస్యా రాదని తెలిసిన తర్వాతే పెళ్లికి ఒప్పుకుందని చెప్పాడు వినోద్. ఈ మధ్యే ఈయనపై ఇంటి ఓనర్ దాడి చేయడం సంచలనంగా మారింది.
previous post