చమ్మక్ చంద్ర గురించి ఆసక్తికరమైన అంశాలు బయటపెట్టాడు కమెడియన్ సత్తిపండు. ప్రస్తుతం చంద్ర జబర్దస్త్‌లో లేకపోయినా కూడా ఆయన ఇప్పటికీ కేరాఫ్ జబర్దస్త్ అనిపించుకుంటున్నాడు. సత్తిపండు కొన్నేళ్లుగా చంద్ర టీంలోనే చేసాడు. వీళ్లిద్దరి కామెడీ బుల్లితెరపై బ్లాక్‌బస్టర్ కూడా. ప్రతీసారి తన స్కిట్స్‌లో సత్తిపండును ఇరికిస్తూ మంచి కామెడీ జనరేట్ చేస్తుంటాడు చమ్మక్ చంద్ర. ఇక ఇప్పుడు తమ ఇద్దరి మధ్య ఉన్న అనుబంధంతో పాటు చంద్ర గురించి ఎవరికీ తెలియని కొన్ని విషయాలు కూడా ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు సత్తిపండు. చమ్మక్ చంద్రను చాలా మంది తక్కువగా అంచనా వేస్తారు.. ఆయనపై లేనిపోని అబాంఢాలు వేస్తారు కానీ ఆయన కంటే మంచోన్ని తానెక్కడా చూడలేదని చెప్పాడు సత్తిపండు. జబర్దస్త్ వదిలేయడం తన సొంత నిర్ణయమని.. అలా చేస్తాడని అనుకోలేదని చెప్పాడు సత్తిపండు. ఓ సారి జబర్దస్త్ షూటింగ్ చేస్తున్నపుడు ఎవరో ఓ అనాథ వస్తే తన కళ్ల ముందే చాలా డబ్బులు ఇచ్చాడని అలాంటి గుప్తదానాలు చమ్మక్ చంద్ర చాలానే చేసాడని చెప్పుకొచ్చాడు సత్తిపండు. అయితే ఇలాంటి చంద్రపై అప్పట్లో స్వాతినాయుడు సంచలన ఆరోపణలు చేసింది. అమ్మాయిలను వాడుకుంటాడని ఆయనపై అబాంఢాలు వేసింది. అయితే ఇప్పుడు సత్తిపండు చెప్తున్న తీరు మాత్రం మరోలా ఉంది. ప్రస్తుతం ఈయన వెండితెర వైపు వెళ్తున్నాడు.