telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

బోల్డ్ పాత్రలో హాట్ యాంకర్

Rashmi-Gautham

“జబర్దస్త్” యాంకర్ రష్మీ గౌతమ్ ఒకవైపు షోలు చేస్తూనే, అప్పుడప్పుడు సినిమాల్లో కూడా కన్పిస్తోంది. ప్రస్తుతం బుల్లితెరపై ఉన్న క్రేజీ యాంకర్లలో రష్మీ ఒకరు. ఇక ఆమె సోషల్ మీడియాలో ఎప్పుడూ అప్డేట్ గా ఉంటూ తన అభిమానులతో చాట్ చేస్తూ ఉంటారు. ఇక సినిమాలు మాత్రమే కాకుండా పలు సామజిక అంశాలపైనా రష్మీ స్పందిస్తూ ఉంటారు. అయితే జబర్దస్త్ కామెడీ షోతో ఎంతో మంది జీవితాలు మారిపోయాయి. అందులో ఎక్స్ ‌ట్రా జబర్దస్త్ యాంకర్ రష్మీ గౌతమ్ ఒకరు. ఈ ప్రోగ్రామ్‌కు ముందు కొన్ని సినిమాల్లో నటించినా ఈ అమ్మడుకు అంతగా కలిసి రాలేదు. ర‌ష్మి మంచి బ్రేక్ కోసం వేచి చూస్తుంది. సోష‌ల్ మీడియాలో మాత్రం ర‌ష్మి గౌత‌మ్ త‌న‌ను తాను ప్ర‌మోట్ చేసుకుంటూ ఉంది. బుల్లితెర‌, వెండితెర‌కే పరిమిత‌మైన ర‌ష్మి గౌత‌మ్ ఇప్పుడు డిజిట‌ల్ మీడియంలోకి ఎంట్రీ ఇస్తుంది. బాలీవుడ్ స‌హా ద‌క్షిణాది స్టార్స్ అంద‌రూ ఇప్పుడు వెబ్ సిరీస్‌ల్లో న‌టిస్తున్నారు. న‌టించ‌డానికి ఆస‌క్తిని చూపిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో ర‌ష్మీ కూడా ఓ వెబ్ సిరీస్‌లో న‌టించ‌నుంది. అది కూడా ఓ లెస్బియ‌న్ పాత్ర‌లో న‌టిస్తుంద‌ని, ఆమె పాత్ర చాలా బోల్డ్‌గా ఉంటుంద‌ని సోష‌ల్ మీడియాలో వార్త‌లు వస్తున్నాయి.

Related posts