telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

రంగమ్మత్తను వదలని మెగాఫ్యామిలీ … చిరు సినిమాలో అనసూయ

chiru

 కేవ‌లం గ్లామ‌ర్ రోల్స్ మాత్ర‌మే కాకుండా క్ష‌ణం, రంగ‌స్థ‌లం, యాత్ర లాంటి సినిమాల‌తో తన‌లో ఎంత మంచి న‌టి ఉందో నిరూపించుకుంది అన‌సూయ. దాంతో ఇప్పుడు ఈమె కోస‌మే ప్ర‌త్యేకంగా కారెక్ట‌ర్స్ రాస్తున్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు అన‌సూయ‌కు మ‌రో బంప‌ర్ ఆఫ‌ర్ వ‌చ్చిన‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. చిరంజీవి ఆచార్యలో అను నటించబోతుంది. తెలుగు ఇండస్ట్రీలో ఇప్ప‌టికే వెంక‌టేష్‌తో ఎఫ్2.. నాగార్జునతో సోగ్గాడే చిన్నినాయనా లాంటి సినిమాల్లో నటించిన ఈ బ్యూటీ ఇప్పుడు చిరంజీవితో కూడా స్క్రీన్ షేర్ చేసుకోబోతుంద‌ని తెలుస్తుంది. కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో చిరంజీవి హీరోగా వస్తున్న ఆచార్య సినిమాలో అన‌సూయ ఓ ప్రత్యేక పాత్రతో పాటు పాటలో కూడా న‌టించ‌నుంద‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి. ప‌ట్టుబ‌ట్టి మ‌రి ప్ర‌త్యేకంగా అన‌సూయ కోస‌మే కొర‌టాల కూడా ఈ కారెక్ట‌ర్ సిద్ధం చేసాడ‌ని ప్ర‌చారం జ‌రుగుతుంది. అన‌సూయ కూడా చిరంజీవి సినిమాలో న‌టించే అవ‌కాశం రావ‌డంతో పొంగిపోతుంది. పైగా మెగా హీరోల‌కు అన‌సూయ ల‌క్కీ బ్యూటీ అయిపోతుంది. వ‌రుణ్ తేజ్ ఎఫ్ 2.. రామ్ చ‌ర‌ణ్ రంగ‌స్థ‌లం సినిమాల్లో న‌టించింది ఈ బ్యూటీ. మరీ ముఖ్యంగా అనసూయను ఇప్పటికీ చిరంజీవి రంగమ్మత్తనే పిలుస్తున్నాడు. మొన్నటికి మొన్న ఓ సినిమా వేడుకలో కూడా అనసూయను రంగమ్మత్త అనే అన్నాడు. అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ తెరకెక్కిస్తున్న సినిమాలో కూడా అనసూయ కీలక పాత్రలో నటిస్తుంది. రంగస్థలం తర్వాత మరోసారి మంచి ఆఫర్ ఇచ్చాడు సుకుమార్.

Related posts