telugu navyamedia
crime news telugu cinema news trending

నటి భానుప్రియ కేసు… అది దొంగతనమట…

BhanuPriya

సెలెబ్రిటీ ఇంట్లో ఏమి జరిగినా అదొక పెద్ద వార్తగా మలిచేస్తుండటం సహజం. అలాగే ఇటీవల నటి భానుప్రియ ఇంటి పనిమనిషి కథ ఎట్టకేలకు సుఖాంతమైంది. ఆంధ్రప్రదేశ్, తూర్పుగోదావరి జిల్లా, సామర్లకోట, సండ్రవారి గ్రామానికి చెందిన ప్రభావతి తన కూతుర్ని కొడుతూ లైంగిక వేధింపులకు గురి చేస్తున్నారని నటి , ఆమె సోదరుడు గోపీకృష్ణలపై సామర్లకోట పోలీస్‌స్టేషన్‌లో పిర్యాదు చేసిన విషయం కలకలం సృష్టించిన విషయం తెలిసిందే.దీనితో సామర్లకోట పోలీసులు కేసు నమోదు చేసి భానుప్రియను విచారించడానికి చెన్నైకి వెళ్లారు.

నటి భానుప్రియ చెన్నైలో ఒక మీడియాకిచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన ఇంటి పనికి తీసుకొచ్చిన 16 ఏళ్ల యువతి ఇంట్లో దొంగతనానికి పాల్ప డిందని, తాము అడగడంతో దొంగిలించిన కొన్ని వస్తువులను తిరిగి ఇచ్చిందని, ఇంకా విలువైన వస్తువులు ఇవ్వలేదని చెప్పారు. తానే ఈ విషయంలో పోలీసులకు ఫిర్యాదు చేస్తానని చెబితే వద్దని పనిమనిషి తల్లి ప్రభావతి ఏడ్చిందని తెలిపారు. పోలీసులు, పిల్లల సంరక్షణ విభాగం వారు పనిపిల్లను తీసుకెళ్లారని నటి భానుప్రియ వివరణ ఇచ్చారు.

Related posts

లారీని ఢీకొన్న కారు.. మంటల్లో లారీ దగ్ధం

vimala p

కేటీఆర్ … నా స్నేహితుడే…, రామ్ చరణ్

vimala p

కార్ దొంగిలించడానికి వచ్చిన దొంగ… యజమాని ఏం చేశాడో చూడండి

vimala p