వార్తలు సంప్రదాయ సాంస్కృతిక వార్తలు

దిగులెందుకే వాన!

It's raining down
దిగులెందుకే వాన
రేయంతా కురిసినా….
తొలి పొద్దుకంతా మురిపెంగా
మళ్ళీ హాజరవుతున్నావ్….!
వదిలిన కబుర్లను
వడివడిగా తెలిపే
చెలికాని మదిలోని
వలపు సడిలా….!
సుతిమెత్తగా సవ్వడిస్తూ….
నా అందెల రవళికి పోటీ పడుతున్నావ్….!
గుప్పెడంత గుండెలో
చప్పుడు చేయని రాగమేదో
వీణ పాటలా వినిపిస్తుంటే….
శృతి కలుపుతూ
నేపథ్య సంగీతమై
పరవశిస్తున్నావ్….!
క్షణ కాలపు విరహానికి
యుగముల దూరాన్ని ఆపాదించే
తన మది సవ్వడికి
జతగా నీ సవ్వడి….
ఇపుడు నాకు యుగళ గీతమవుతోంది….!
దిగులెందుకే వాన
మదిలో కురిసే వలపు చినుకులు
అచ్చంగా నీ ప్రతిబింబాలే అయినప్పుడు….!!
                    -శాంతి కృష్ణ
                      హైదరాబాద్.

Related posts

భారతదేశపు అతి పెద్ద ఫుడ్‌ ట్రక్‌…’కిచెన్‌ ఆన్‌ 16వీల్స్‌’ ఇప్పుడు హైదరాబాద్‌లో…

chandra sekkhar

సకల కళా వల్లభుడు మూవీ ట్రైలర్ లాంచ్.. ‘చిత్రాలు’…

chandra sekkhar

జల్సాలకు అలవాటు పడి… దొంగగా మారిన విశాల్ !?

jithu j

Leave a Comment