telugu navyamedia
సినిమా వార్తలు

పెళ్ళి కాకుండానే తండ్రి కాబోతున్న హీరో

Arjun-Rampal

బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ తండ్రి కాబోతున్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించాడు. అయితే అర్జున్ కు ఇంకా పెళ్లి కాలేదు. చాలా రోజులుగా తన ప్రేయసి గాబ్రియేలాతో సహజీవనం చేస్తున్నాడు. గాబ్రియేలా సౌత్ ఆఫ్రికాకు చెందిన మోడల్. ముంబైలో జరిగిన ఓ పార్టీలో ఆమెకు అర్జున్ తో పరిచయం ఏర్పడడం, అది కాస్త ప్రేమగా మారడం జరిగాయి. ఇప్పుడు ఈ జంట ఓ బిడ్డకు జన్మనివ్వబోతుంది. నిజానికి అర్జున్ కి గతంలో పెళ్లైంది. ఇద్దరు కూతుళ్లు కూడా ఉన్నారు. కానీ గతేడాదిలో తన భార్య నుండి విడాకులు తీసుకున్న అర్జున్ అప్పటినుండి గాబ్రియేలాతో కలిసి ఉంటున్నాడు. ఇక అర్జున్ మొదటి భార్య కూతురు త్వరలోనే హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వబోతుంది. కూతురు హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చే సమయానికి అర్జున్ కు మరో బిడ్డ పుట్టబోతోంది.

Related posts