ఆంధ్రప్రదేశ్ రాజకీయ వార్తలు వార్తలు

ఎంపీ సీఎం రమేశ్ ఇంట్లో ఐటీ సోదాలు

CM Ramesh coming to Hyderabad

టీడీపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్‌ నివాసాలు, వ్యాపార సంస్థల్లో  ఐటీ దాడులు ప్రారంభమయ్యాయి. ఆదాయపన్ను శాఖ అధికారులు శుక్రవారం తనిఖీలు చేపట్టారు. ఏకకాలంలో హైదరాబాద్, కడప జిల్లాలో ప్రారంభమైన ఈ దాడుల్లో 100 మంది ఐటీ అధికారులు పాల్గొన్నారు.. ఆయన చూపించిన ఆదాయానికి, లెక్కలకు పొంతన లేకపోవడంతో ఐటీ అధికారులు సోదాలు చేపట్టినట్టు తెలుస్తోంది.

ఆస్తుల పత్రాలు, ఇతర డాక్యుమెంట్లను అధికారులు తనిఖీ చేస్తున్నారు.సోదాల్లో 15 మంది కమిషనర్ స్థాయి అధికారులు పాల్గొన్నారు. దాదాపు 25 నుంచి 30 చోట్ల ఐటీ సోదాలు చేస్తున్నట్లు సమాచారం. దేశంలో ఐటీ దాడులు ఎక్కడ, ఎందుకు చేస్తున్నారు, ఏపీలో దాడుల వివరాలు ఇవ్వాలంటూ ఐటీకి ఆయన నోటీసులు జారీ చేశారు. నోటీసులు జారీ చేసిన మూడు రోజుల్లోనే రమేష్‌ ఆస్తులపై దాడులు దాడులు చోటుచేసుకోవడం గమనార్హం. కడప ఉక్కు పరిశ్రమపై ప్రశ్నిస్తున్నందుకే సీఎం రమేష్ ఇంట్లో ఐటీ సోదాలు చేపట్టిందని టీడీపీ నేతలు మండిపడుతున్నారు. 

Related posts

ప్రియాంకా రమణ్ ‘చిత్రాలు’…

chandra sekkhar

బిచ్చగాడిని కొట్టి చంపిన ప్రముఖ మోడల్… కేసు నమోదు

nagaraj chanti

‘స‌వ్యసాచి’ టీజర్…

chandra sekkhar

Leave a Comment