telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

155 కోట్లకు పన్ను ఎగవేత .. 100 కోట్ల జరిమానా విధించిన .. ఐటీ శాఖ

IT officials raid houses of Sandalwood actors

ఆదాయపు పన్ను శాఖ ఇటీవల సామాన్యులతో సహా అందరిపై కొరడా జులిపిస్తుంది. ఎవరు పన్ను ఎగవేసినా వారిపై భారీగా జరిమానా విధిస్తూ వస్తుంది ఈ శాఖ. తాజాగా టాలీవుడ్ లో అగ్రతారలపై ఈ జరిమానా కొరడా జులిపించిన విషయం తెలిసిందే. ఇప్పుడు యూపీఏ ఛైర్ పర్సన్ సోనియాగాంధీ, కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీలకు ఆదాయపు పన్ను శాఖ నోటీసులు జారీ చేసింది.

వీరిరువురూ ఉద్దేశ పూర్వకంగా పన్ను ఎగవేశారని నోటీసులో పేర్కొంది. 2011-12 ఆర్థిక సంవత్సరానికి గాను వీరిద్దరూ రూ. 300 కోట్ల ఆదాయాన్ని తక్కువ చేసి చూపించారని తెలిపింది. ఆ సంవత్సరం రాహుల్ ఆదాయం రూ. 155 కోట్లు అయినప్పటికీ… రూ. 68 లక్షల ఆదాయాన్ని మాత్రమే చూపించి, ఆ మొత్తానికే పన్ను చెల్లించారని పేర్కొంది. రూ. 155.41 కోట్లకు సంబంధించి సోనియాగాంధీ… రూ. 155 కోట్లకు సంబంధించి రాహుల్ గాంధీలు జరిమానాతో కలిపి రూ. 100 కోట్లు చెల్లించాలని సూచించింది.

Related posts