telugu navyamedia
telugu cinema news trending

“తెనాలి రామ‌కృష్ణ బి.ఎ బి.ఎల్‌” ట్రైలర్

Tenali

యువ క‌థానాయ‌కుడు సందీప్ కిష‌న్ హీరోగా న‌టిస్తోన్న చిత్రం “తెనాలి రామ‌కృష్ణ బి.ఎ బి.ఎల్‌”. “కేసులు ఇవ్వండి ప్లీజ్‌” ట్యాగ్ లైన్‌. తెలుగు, త‌మిళ భాష‌ల్లో ఈ సినిమా రూపొందుతోంది. శ్రీ నీల‌కంఠేశ్వ‌ర స్వామి క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై అగ్ర‌హారం నాగిరెడ్డి, సంజీవ్ రెడ్డి, రూపా జ‌గ‌దీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చిత్రంలో సందీప్ కిష‌న్ లాయ‌ర్ పాత్ర‌లో క‌న‌ప‌డుతున్నారు. ఔట్ అండ్ ఔట్ కామెడీ చిత్రంగా ద‌ర్శ‌కుడు జి.నాగేశ్వ‌ర‌రెడ్డి ఈ చిత్రాన్నితెర‌కెక్కించారు. లాఫింగ్ రైడ‌ర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో హ‌న్సిక, వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ హీరోయిన్స్‌గా న‌టిస్తున్నారు. సాయికార్తీక్ సంగీతం, సాయిశ్రీరాం సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. తాజాగా చిత్ర ట్రైల‌ర్ విడుద‌ల చేశారు. ఫన్నీ సన్నివేశాల‌తో రూపొందిన ట్రైల‌ర్ ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో ఆకట్టుకుంటోంది. నిన్న విడుదలైన ఈ చిత్రం ట్రైలర్ కు 24 గంటల్లో 1 మిలియన్ వ్యూస్ రావడం విశేషం.  నవంబ‌ర్ 15న విడుద‌ల కానున్న చిత్ర ట్రైల‌ర్‌పై మీరు ఓ లుక్కేయండి.

Related posts

కూలీలకు .. 25 రూపాయలలో నెల పాస్ .. : రైల్వేశాఖ

vimala p

ప్రముఖ వెబ్ సైట్ కు సందీప్ కిషన్ కౌంటర్

vimala p

ఎన్టీఆర్ కధానాయకుడు.. గురించి.. చంద్రబాబు.. ఏమన్నాడంటే..

vimala p