telugu navyamedia
రాజకీయ వార్తలు సామాజిక

భారత తొలి మహిళా డీజీపీ కన్నుమూత

KanchanChaudhary dgp

భారత తొలి మహిళా డీజీపీ కంచన్ చౌదరి భట్టాచార్య(72) సోమవారం అర్ధరాత్రి కన్నుమూశారు. గత కొద్దికాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న చౌదరి భట్టాచార్య ముంబైలోని ఆసుపత్రిలో చికిత్సపొందుతూ తుదిశ్వాస విడిచారు. ఈ మేరకు ఉత్తరాఖండ్ పోలీసులు ఓ ప్రకటన విడుదల చేశారు. భట్టాచార్య మృతిపట్ల దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖులు, ఐపీఎస్ అధికారులు నివాళులర్పించారు. భట్టాచార్య సేవలను ఉత్తరాఖండ్ పోలీసులు గుర్తు చేసుకున్నారు.

ఆమెకు భర్త, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మంగళవారం సాయంత్రం ముంబైలో అంత్యక్రియలు జరగనున్నట్టు ఉత్తరాఖండ్ డీజీపీ అశోక్ కుమార్ తెలిపారు. 1973 ఐపీఎస్ బ్యాచ్ అధికారిణి అయిన కాంచన్ చౌదరి.. 2004లో ఉత్తరాఖండ్ డీజీపీగా పని చేశారు. తొలి మహిళా ఐపీఎస్‌గా అరుదైన ఘనతను సాధించారు. 2007 అక్టోబరు 31న పదవీ విరమణ చేసిన ఆమె.. 2014 లోక్ సభ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 33ఏళ్ల తన సర్వీసులో ఎన్నో ఘనతలు ఆమె సొంతం చేసుకున్నారు. రాష్ట్రపతి మెడల్, రాజీవ్ గాంధీ అవార్డులను ఆమె అందుకున్నారు.

Related posts