telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ

తొలి జీవో జారీ చేసిన జగన్ సర్కార్!

machilipatnam as ntr district by jagan

ఆంధ్రప్రదేశ్ లో  వైఎస్ జగన్ ప్రభుత్వం తొలి జీవోను జారీ చేసింది. నిన్న ప్రమాణ స్వీకారోత్సవం అనంతరం వృద్దాప్య పెన్షన్ ను పెంచుతున్నట్టు జగన్ ప్రకటించారు. ఈ మేరకు తన తొలి సంతకాన్ని ఆ ఫైల్ పై పెట్టిన సంగతి తెలిసిందే. ప్రస్తుతమున్న పింఛన్లను రూ. 2 వేల నుంచి రూ. 2,250కి పెంచుతున్నట్టు జగన్ ప్రకటించారు.  దీనికి ‘వైఎస్ఆర్ పెన్షన్ కానుక’ అని పేరు  పెట్టారు.  

కొత్త పెన్షన్ కు సంబంధించి చీఫ్ సెక్రెటరీ జీవోను విడుదల చేశారు. వికలాంగులకు రూ. 3 వేలు, కిడ్నీ బాధితులకు రూ. 10 వేలతో పాటు వయోవృద్ధుల పెన్షన్ వయసును 65 నుంచి 60కి కుదిస్తున్నట్టు జీవోలో పొందు పరిచారు. జూలై 1 నుంచి కొత్త పెన్షన్ పథకం అమలవుతుందని ఇందులో పేర్కొన్నారు.

Related posts