telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సాంకేతిక

వ్యోమనౌకను .. చంద్రుడికి దగ్గర చేస్తున్న … ఇస్రో ..

isro makes ship nearer to moon

భారత్ గత నెలలో విజయవంతంగా ప్రయోగించిన చంద్రయాన్-2 జాబిల్లికి దగ్గరవుతోంది. రెండు రోజుల క్రితం వ్యోమనౌకను చంద్రుడి కక్ష్యలో ప్రవేశపెట్టిన శాస్త్రవేత్తలు.. నిన్న మధ్యాహ్నం చంద్రుడికి స్పేస్‌క్రాఫ్ట్‌కి ఉన్న దూరాన్ని 4,412 కిలోమీటర్ల మేర తగ్గించారు. ఇందుకోసం 20 నిమిషాలపాటు మోటార్లను మండించారు. తొలి రోజు చంద్రుని కక్ష్యలోకి ప్రవేశించిన దీర్ఘవృత్తాకార కక్ష్యలో తిరిగిన వ్యోమనౌక నాలుగో విన్యాసం పూర్తయ్యాక కక్ష్య ఆకారం గుండ్రంగా మారనుంది.

వ్యోమనౌకకు సంబంధించి అన్ని పరిణామాలు సాధారణ స్థితిలోనే ఉన్నాయని ఇస్రో శాస్త్రవేత్తలు తెలిపారు. ప్రస్తుతం చంద్రుని ఉపగ్రహానికి ఓ చివరలో 118 కిలోమీటర్ల దూరంలో స్పేస్‌క్రాఫ్ట్ ఉందని పేర్కొన్నారు. ఈ నెల 28న తెల్లవారుజామున మరో విన్యాసం చేపట్టనున్నట్టు శాస్త్రవేత్తలు వివరించారు. సెప్టెంబరు 7న చంద్రుడిపై వ్యోమనౌక ల్యాండ్ కానుంది.

Related posts