telugu navyamedia
ట్రెండింగ్ సాంకేతిక

విజయవంతంగా .. ఇస్రో ప్రయోగం..

isro launched successfully radar satellite

మరో విజయం భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ఖాతాలో చేరింది. నెల్లూరు జిల్లాలోని సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ నుంచి ఈ తెల్లవారుజామున 5:30 గంటలకు పోలార్ శాంటిలైట్ లాంచ్ వెహికల్-సి46(పీఎస్ఎల్‌వీ) నిప్పులు చిమ్ముకుంటూ నింగిలోకి దూసుకెళ్లింది. 615 కిలోల బరువున్న రాడార్ ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ రిశాట్ -28న 555 కిలోమీటర్ల ఎత్తులో నిర్ణీత కక్ష్యలో ప్రవేశపెట్టింది. దీంతో శాస్త్రవేత్తలో ఆనందం వెల్లివిరిసింది.

ఈ రిశాట్-2బీఆర్1 ఉపగ్రహం కాలపరిమితి రెండేళ్లు. సరిహద్దుల్లో శత్రువుల కదలికలను, ఉగ్రశిబిరాలను ఇది సులభంగా గుర్తిస్తుంది. కాబట్టి రక్షణ శాఖకు ఇది ఎంతో కీలకం కానుంది. అలాగే, వ్యవసాయం, అటవీ, విపత్తు నిర్వహణకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇస్రో చేపట్టిన పీఎస్ఎల్‌వీ ప్రయోగాల్లో ఇది 48వది.

Related posts