telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు సాంకేతిక

2021 నాటికి .. ఇస్రో వ్యోమగాములతో సిద్ధం..అందులో వాళ్ళు కూడా..

isro human based gagan yan project started

ఇస్రో ఇప్పటి వరకు ఎన్ని ఘనతలు సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే అంతరిక్షంలోకి వ్యోమగాములను సైతం పంపించేందుకు భారత్ సిద్ధం అయ్యింది. దానిలో భాగంగానే ముందుగా మానవరహిత మిషన్ విజయవంతం చేసి, అనంతరం వ్యోమగాములతో కూడిన మిషన్ నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. దానిగురించి ఇస్రో చీఫ్ కె.శివన్ మాట్లాడుతూ, స్పేస్ టెక్నాలజీలో ఇప్పటికే అగ్రరాజ్యాలతో సమానంగా సత్తా చాటుతున్న భారత్ కీలక లక్ష్యం దిశగా వడివడిగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే భారీ ఎత్తున అంతరిక్షంలోకి శాటిలైట్లను పంపుతున్న భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ‘ఇస్రో’… తాజాగా అంతరిక్షంలోకి వ్యోమగాములను పంపే ప్రాజెక్టుపై పూర్తి స్థాయిలో దృష్టి సారించింది. గగన్ యాన్ మిషన్ ద్వారా 2021 డిసెంబర్ లో అంతరిక్షంలోకి వ్యోమగాములను పంపడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు.

భారత ఔన్నత్యాన్ని పెంచేందుకు, దేశ వ్యాప్తంగా ఆరు ఇంక్యుబేషన్ సెంటర్లు, రీసర్చ్ సెంటర్లను ఏర్పాటు చేయబోతున్నట్టు శివన్ తెలిపారు. గగన్ యాన్ కు సంబంధించిన ప్రారంభ శిక్షణ భారత్ లోనే ఉంటుందని… ఆ తర్వాత అడ్వాన్స్డ్ ట్రైనింగ్ రష్యాలో ఉండే అవకాశం ఉందని చెప్పారు. మన వ్యోమగాముల్లో మహిళలు కూడా ఉంటారని తెలిపారు. రెండు మానవ రహిత మిషన్లను డిసెంబర్ 2020, జూలై 2021లో నిర్వహిస్తామని… వ్యోమగాములతో కూడిన మిషన్ ను డిసెంబర్ 2021లో నిర్వహిస్తామని చెప్పారు. గగన్ యాన్ ప్రాజెక్టు కార్యాచరణ మొదలైందని తెలిపారు. ఈ ప్రాజెక్టు ఇస్రోకు కీలక మలుపు కాబోతోందని అన్నారు. ఈ ప్రాజెక్టు కోసం కేంద్ర కేబినెట్ రూ. 10వేల కోట్ల నిధులను మంజూరు చేసింది. ఈ ప్రాజెక్టు విజయవంతం అయితే… నింగిలోకి సొంతంగా వ్యోమగాములను పంపిన నాలుగో దేశంగా భారత్ అవతరిస్తుంది. మరోవైపు, గగన్ యాన్ ప్రాజెక్టుకు సహకారం అందించే విషయంలో రష్యా, ఫ్రాన్స్ లతో భారత్ ఒప్పందం కుదుర్చుకుంది.

Related posts