telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సాంకేతిక

విక్రమ్ లాండింగ్ లో .. తడబాటు..

isro disappointed on vikram landing

ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూసిన విక్రమ్ ల్యాండర్ నుంచి సిగ్నల్స్ కట్ అయ్యాయి. చంద్రుడికి 2.1 కిలో మీటర్ల దూరంలో ఉండగా సంకేతాలు తెగిపోయాయి. ఈ ఘటనతో అప్రమత్తమైన శ్రాస్త్రవేత్తలు డాటాను విశ్లేషించే పనిలోపడ్డారు. కాగా మీడియా ఇస్రో శాస్త్రవేత్తలను… విక్రమ్ ల్యాండర్ క్రాష్ అయ్యిందా? అని ప్రశ్నించగా, ఇంతవరకూ దీనికి సంబంధించిన రిజల్ట్ తమకు అందలేదని, ఇందుకు కొంత సమయం పడుతుందన్నారు. దీనిని తాము నిర్ధారించలేమన్నారు.

సుమారు 47 రోజుల ప్రయాణం అనంతరం విక్రమ్ ల్యాండర్ నుంచి సిగ్నల్స్ తెగిపోయాయి. విక్రమ్ ల్యాండర్ చంద్రునిలోని దక్షిణ ధృవంలో దిగేందుకు ప్రయత్నించింది. ఈ ప్రయోగంపై ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురు చూసింది. ఒకవేళ విక్రమ్ చంద్రునిపైకి చేరివుంటే ఇది దేశ చరిత్రలో చారిత్రాత్మక ఘట్టంగా నిలిచివుండేది.

Related posts