telugu navyamedia
telugu cinema news trending

“ఇస్మార్ట్ శంకర్” టైటిల్ లిరికల్ వీడియో సాంగ్

Ismart-Shankar

పూరి జగన్నాధ్ టూరింగ్ టాకీస్, పూరి కనెక్ట్స్ బ్యానర్‌పై పూరి జగన్నాధ్, ఛార్మి సంయుక్త నిర్మాణంలో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ చిత్రం “ఇస్మార్ట్ శంకర్”. “డబుల్‌ దిమాక్‌ హైదరబాదీ” అనేది ఈ చిత్రానికి ట్యాగ్ లైన్. ఈ చిత్రాన్ని లావణ్య సమర్పిస్తున్నారు. రామ్ పోతినేని హీరోగా రూపొందుతున్న ఈ సినిమాలో నిధి అగర్వాల్, నభా నటేష్ హీరోయిన్స్ గా కనపడనున్నారు. ఈ చిత్రంలో స్టైలిష్ లుక్‌లో రామ్ కనిపించనున్నాడు. తాజాగా ఈ చిత్రం నుంచి టైటిల్ సాంగ్ “ఇస్మార్ట్…” లిరికల్ వీడియో సాంగ్ విడుదలైంది. ఈ పాటను అనురాగ్ కులకర్ణి ఆలపించగా… భాస్కర్ భట్ల లిరిక్స్ అందించారు. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ఇక తాజాగా విడుదలైన టైటిల్ లిరికల్ వీడియో సాంగ్ పూర్తిగా తెలంగాణ యాసలో సాగుతూ రామ్ అభిమానులను ఆకట్టుకుంటోంది. మీరు కూడా ఈ సాంగ్ ను వీక్షించండి మరి. “ఇస్మార్ట్‌ శంకర్‌” జూలై 12న విడుదల కానుంది.

Related posts

నగ్నంగా నటించడానికి మరో హీరోయిన్ రెడీ

vimala p

క్రీడాకారులకు .. అవార్డుల పంట..

vimala p

మా చిట్టి కి నేర్పండమ్మా . . ! 

vimala p