telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

‘ఇస్మార్ట్ శంకర్’ మరో రికార్డు

Ismart-Shankar

ఎనర్జిటిక్ స్టార్ రామ్-పూరి జగన్నాథ్ కాంబినేషన్లో వచ్చిన ‘ఇస్మార్ట్ శంకర్ ‘ మూవీ ఎంత విజయం సాధించిందో తెలిసిందే. టెంపర్ మూవీ తర్వాత హిట్ ముఖం చూడని పూరి జగన్నాథ్ కు, వరుస పరాజయాలతో డీలాపడ్డ రామ్ కు ‘ఇస్మార్ట్ శంకర్ ‘ విజయం మంచి కిక్కిచ్చింది. ఈ సినిమాతో మాస్ సినిమాలను సైతం చేయగలనని రామ్ నిరూపించుకున్నాడు. తన హీరోలను ఎంతో ప్రత్యేకంగా ప్రజెంట్ చేసే పూరి జగన్నాథ్ రామ్ ని మాస్ హీరోగా చక్కగా ఎలివేట్ చేశాడు. కాస్ట్యూమ్స్, డైలాగ్ డెలివరీలో ప్రత్యేకతను చూపించాడు. ఈ సినిమా విజయంలో మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ ముఖ్య పాత్ర పోషించారు. ఈ చిత్రానికి సంగీత దర్శకుడిగా ఆయనను ఎంపిక చేసినపుడు ఆయన సామర్థ్యంపై అందరూ సందేహాలు వ్యక్తం చేశారు. సినిమాలకు దూరంగా ఉన్నాడని, ఫామ్ లో లేడని అంతా భావించారు. వారందరి అనుమానాలను పటాపంచలు చేస్తూ మణిశర్మ చక్కటి ఆల్బమ్ ఇచ్చి తన కం బ్యాక్ ని ఘనంగా చాటుకున్నారు. ఇస్మార్ట్ శంకర్ విడుదలై ఇటీవలే ఏడాది పూర్తి చేసుకుంది. ఈ చిత్రాన్ని హిందీలోకి డబ్ చేసి యూట్యూబ్లో రిలీజ్ చేయగా 120 మిలియన్స్ కు పైగా వ్యూస్ వచ్చాయి. ఉత్తరాది వారిని సైతం ఈ సినిమా మెప్పించింది. తాజాగా ఇస్మార్ట్ శంకర్ ఆడియో ఆల్బమ్ ‘జియో మ్యూజిక్ ప్లాట్ ఫామ్’ (జియో సావన్)లో 100 మిలియన్ల లైవ్ స్ట్రీమ్స్ అధిగమించి రికార్డు సాధించింది.

Related posts