telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

“ఇస్మార్ట్ శంకర్” ట్విట్టర్ టాక్

ismart sankar shooting started

పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం “ఇస్మార్ట్‌ శంకర్‌”. ఈ చిత్రంలో రామ్ హీరోగా నటిస్తుండగా నిధి అగర్వాల్‌, నభా నటేశ్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. పూరి జ‌గ‌న్నాథ్ టూరింగ్ టాకీస్‌, పూరి కనెక్ట్స్ ప‌తాకాల‌పై పూరి జ‌గ‌న్నాథ్‌, ఛార్మి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మెలోడి బ్ర‌హ్మ మ‌ణిశ‌ర్మ సంగీత సారథ్యంలో విడుద‌లైన నాలుగు పాట‌ల‌కు మంచి స్పందన వ‌చ్చింది. అలాగే టీజ‌ర్‌, ట్రైలర్ కు అద్భుతమైన స్పందన వ‌చ్చింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ట్రైలర్ లు, టీజర్ లు ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. సినిమాకి ‘A’ సర్టిఫికేట్ రావడంతో యూత్ లో క్రేజ్ పెరిగిపోయింది. ఇప్పటికే ఈ సినిమా షోలు అమెరికా లాంటి ప్రాంతాల్లో ప్రదర్శించడంతో సినిమా టాక్ ఏంటో బయటకి వచ్చింది. కొందరు సినిమా బాగుందని, టైటిల్ సాంగ్, దిమాఖ్ ఖరాబ్ వంటి పాటల్లో డాన్స్ కుమ్మేశారని.. క్లైమాక్స్ లో వచ్చే ఫైట్ చాలా బాగుందని.. మణిశర్మ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదుర్స్ అంటూ ట్వీట్ లు చేస్తున్నారు. మరికొందరు మాత్రం పూరికి మరో ఫ్లాప్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఫైనల్ టాక్ ఏంటో తెలియాలంటే సినిమా రివ్యూలు వచ్చే వరకూ ఎదురు చూడాల్సిందే.

Related posts