telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

నిన్ను గ‌ట్టిగా హ‌త్తుకుని థాంక్స్ చెప్పాల‌ని ఉంది… : పూరీ జగన్నాథ్

Ismart-Shankar

గత ఏడాది డాషింగ్ డైరెక్టర్ పూరీజగన్నాథ్ దర్శకత్వంలో ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా తెరకెక్కిన “ఇస్మార్ట్ శంకర్” ఎంతటి ఘన విజయాన్ని అందుకుందో అందరికీ తెలిసిన విషయమే. ఈ సినిమాతో పూరీజి ఫుల్ జోష్ ఇచ్చింది. ఈరోజుతో ఈ సినిమా విడుదలై ఒక సంవత్సరం పూర్తి కావడంతో ఈ సినిమాకు సంబంధించి రామ్‌కు ధన్యవాదాలు చెబుతూ దర్శకుడు పూరి జగన్నాథ్‌ “ఇస్మార్ట్ శంక‌ర్ విజ‌యం నాలో తిరిగి శ‌క్తిని నింపింది. న‌న్ను న‌మ్మి సినిమా చేసినందుకు రామ్‌కు కృత‌జ్ఞ‌త‌లు. నీతో ఉండ‌టం ప్ర‌తిరోజూ సెల‌బ్రేష‌నే. నిన్ను గ‌ట్టిగా హ‌త్తుకుని థాంక్స్ చెప్పాల‌ని ఉంది. నువ్వు తురుం రా’” అని ట్వీట్ ‌చేశారు దీనికి హీరో రామ్ స్పందిస్తూ ”నా గ‌న్ మిమ్మ‌ల్ని క‌లిసిన రోజు. మీరు ఇస్మార్ట్ శంక‌ర్‌ను నా ముందు ఉంచ‌టం నాకు మ‌రుపురాని రోజు. మ‌రెవ‌రూ చేయ‌లేని విధంగా న‌న్ను చూపినందుకు ధ‌న్య‌వాదాలు. ల‌వ్ యూ… మిమ్మ‌లి చూడ‌టానికి వేచి ఉండ‌లేక‌పోతున్నాను” అని రామ్‌ పూరి ట్వీట్‌ను షేర్‌ చేస్తూ ట్వీట్‌ చేశారు. ప్రస్తుతం టాలీవుడ్ యూత్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ తో ఫైటర్ అనే భారీ పాన్ ఇండియా మూవీ తీస్తున్నారు పూరి జగన్నాథ్.

Related posts