telugu navyamedia
ఆరోగ్యం ట్రెండింగ్

మూత్రం రంగు మారితే.. అనారోగ్యమేనా ..!

is urin color describes health status

సాధారణంగా ఆరోగ్యంగా ఉన్న వారి మూత్రం లేత పసుపు రంగులో ఉంటుంది. అయితే కొన్ని సార్లు మూత్రం రంగు మారుతూ ఉంటుంది. ముదురు గోధుమరంగు లేదా ముదురు పసుపు రంగులలో ఉంటె మాత్రం అనారోగ్య సమస్యలు ఉన్నట్టు అర్ధం చేసుకోవాలి. వెంటనే డాక్టర్ ని సంప్రదించి చికిత్స చేయించుకోవాలి. అయితే మూత్రం డార్క్ కలర్ లో ఉంటే ఏ అనారోగ్య సమస్యలకు చిహ్నమో తెలుసుకుందాం..!.

నీరు శరీరానికి, అది ఈ ఎండాకాలంలో చాలా అవసరం. శరీరంలో సరైన స్థాయిలో ద్రవాలు లేకపోవటం వలన డీ హైడ్రేషన్ సమస్య వస్తుంది. ఈ సమస్య ఉన్నప్పుడు మూత్రం డార్క్ రంగులోకి మారుతుంది.

is urin color describes health statusఈ సమస్య ఉన్నప్పుడు నోరు పొడిగా మారడం, తల దిమ్ముగా అనిపించడం, నీరసం వంటి లక్షణాలు ఉంటాయి. ఈ లక్షణాలు కనిపించినప్పుడు మంచి నీటిని ఎక్కువగా త్రాగాలి.

మూత్రం డార్క్ బ్రౌన్ కలర్ లో ఉంటే లివర్ వ్యాధులు ఉన్నట్టు అర్ధం చేసుకొని డాక్టర్ దగ్గరకు వెళ్లి చికిత్స చేయించుకోవాలి.

Related posts