telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

ట్రంప్ కి మెలానియా విడాకులు ఇవ్వనుందా…?

trump visit tajmahal

తాజాగా జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓడిపోయిన డొనాల్డ్ ట్రంప్‌కు మరో పాక్‌ తగిలింది. భార్య మెలానియాతో ట్రంప్‌ సంబంధాలు తెగిపోయినట్టు తెలుస్తోంది. ఈ విషయాలను మెలానియా ట్రంప్ మాజీ రాజకీయ సహాయకురాలు ఒమరోసా న్యూమ్యాన్  చెప్పినట్టు ప్రచారం జరుగుతోంది. ట్రంప్ వైట్ హౌస్ నుంచి బయటకు రాగానే మెలానియా అతనికి విడాకులు ఇవ్వబోతోందని వార్తలు వస్తున్నాయి. 2005 జనవరి 22న ట్రంప్‌, మెలానియాల పెళ్లి జరిగింది. అయితే, 15 సంవత్సరాల వివాహ బంధం త్వరలో విచ్ఛిన్నం కాబోతోందని, దీనికి సంబంధించిన చర్చలు జరుగుతున్నాయని సమాచారం. అమెరికాలో అధ్యక్షుడి భార్యగా  ఉండడం అంటే అత్యంత గౌరవమైన అంశం. ఆ దేశంలో ఫస్ట్‌ లేడీకి కూడా అధ్యక్ష్యుడికి ఉన్నంత ప్రాధాన్యత ఉంటుంది. అందుకే ఎప్పట్నుంచో విభేదాలున్నప్పటికీ అధ్యక్ష పదవిలో ఉండగా మెలానియా ఆయనకు విడాకులు ఇచ్చి అవమాన పరచాలని అనుకోలేదని, ఇప్పుడు ట్రంప్‌ ఓడిపోవడంతో ఆయన వైట్‌ హౌస్‌ వీడిన వెంటనే మెలానియా కూడా ఆయన నుంచి విడిపోతారని చెబుతున్నారు. నిజానికి ట్రంప్‌ అధ్యక్షుడు అయిన వెంటనే మెలానియా శ్వేతసౌధానికి రాలేదు. ట్రంప్‌ వచ్చిన 5 నెలలకు ఆమె వైట్‌ హౌస్‌ కొచ్చారు. అయితే కొడుకు బారెన్‌ స్కూలింగ్‌ కోసమే ఆమె వైట్‌ హౌస్‌కి రాలేదన్న వార్తలు వచ్చాయి.

Related posts