telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

134 అడుగులు, 2065 కేజీల అనకొండ… చంపేశారా ?

Anakonda

ఓ భారీ అనకొండను రాయల్ బ్రిటీష్ కమాండోస్ అంతమొందించారనే వార్త కొంతకాలంగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ అనకొండ 134 అడుగుల పొడవుందని, 2065కేజీల బరువుందని ఆ పోస్టులో పేర్కొన్నారు. అంతేగాక ఇప్పటి వరకు 250 మంది మనుషులను, 2300పైగా జంతువులను ఈ పాము మింగేసిందని చెప్పారు. ఈ వార్త చాలాకాలంగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దీన్ని మొట్టమొదటిసారి రమాకాంత్ కజారియా అనే వ్యక్తి 2015లో ఫేస్‌బుక్‌లో షేర్ చేశాడు. ఇప్పటికీ ఈ పోస్టు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉంది. దీన్ని ఇప్పటికి 1.4లక్షలమందికిపైగా షేర్ చేశారు. ఆ పోస్టులో తెలిపిన వివరాల ప్రకారం, ఆఫ్రికాలోని రాయల్ బ్రిటీష్ కమాండోలు 37రోజులపాటు పోరాడి ఇక్కడి అమెజాన్ నదీతీరంలో ఈ భారీ అనకొండను అంతమొందించారు. ఈ వార్త విన్న అనేకమంది దీనిపై ఆసక్తి కనబరిచారు. అయితే ఇదంతా నిజమేనా అని ఓ క్షణం ఆలోచిస్తే.. పచ్చి అబద్ధమని తేలిపోతుంది. ఎందుకంటే అసలు ఆఫ్రికా వద్ద రాయల్ బ్రిటీష్ కమాండోలు ఎందుకుంటారు? అలానే అమెజాన్ సౌత్‌అమెరికాలో ఉంది. ఆఫ్రికాలో కాదు. ఈ పోస్టులో షేర్ చేసిన ఫొటోలోని పాము శరీరంపై ఎలాంటి గాయాలూ లేవు. 37 రోజులపాటు దాన్ని చంపడానికి కష్టపడితే దాని శరీరంపై చిన్నగాయం కూడా లేకపోవడం ఆశ్చర్యకరం. మరికొంచెం జాగ్రత్తగా గమనిస్తే ఫొటోషాప్‌లో ఈ ఫొటోను తయారుచేసినట్లు తెలిసిపోతుంది. పాము బొమ్మ అంచులు, ఫొటోలోని మనుషుల ప్రవర్తన చూస్తే ఈ విషయం మరింత స్పష్టంగా అర్థమవుతుంది. అంతేకాదు ప్రపంచ పర్యావరణ శాస్త్రవేత్తలు వెల్లడించిన వివరాల ప్రకారం, ప్రపంచంలోనే అతిపెద్ద అనకొండ కేవలం 30 అడుగుల పొడవే ఉంది. మరీ ఇలా 134 అడుగుల పొడవున్న అనకొండ ఉండటం అసంభవమని వారు తేల్చిచెప్తున్నారు. సోషల్ మీడియాలో వచ్చే ఇటువంటి వార్తలు నమ్మి మోసపోవద్దని హెచ్చరిస్తున్నారు.

Related posts