telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

మహర్షి ప్రీ రిలీజ్ ఈవెంట్ .. హై లైట్ అదేనట.. !

Maharshi

తాజా మూవీ ‘మహర్షి’ టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు మరోసారి ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ప్రస్తుతానికి తెలుగు ఇండస్ట్రీని వేడెక్కిస్తున్న సమ్మర్ ప్రాజెక్టు కూడా ఇదే. ముగ్గురు మెగా నిర్మాతలు కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్న ‘మహర్షి’ని డైనమిక్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి ఎలా తీశాడన్న ఆసక్తి ప్రిన్స్ ఫ్యాన్స్‌ని పిచ్చెక్కిస్తోంది. అభిమానుల సంగతి అలా ఉంటే.. నిర్మాతలు మాత్రం.. మహర్షి మూవీకి హైప్ ఎలా తీసుకురావాలి, సమ్మర్ వసూళ్లను ఎలా దండుకోవాలి అనే ధ్యాసలో పడ్డారు. ఇప్పటికే టీజర్, నాలుగు సింగిల్స్, వాటి వీడియో వెర్షన్స్ రిలీజై సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నప్పటికీ.. మహేష్ మూవీకి రావాల్సినంత క్రేజ్ మాత్రం ఇంకా రాలేదన్నది ప్రొడ్యూసర్ల బెంగ.

అందుకే.. ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ని ‘మహర్షి’కి ముందస్తు కమర్షియల్ ఎలిమెంట్‌గా వాడుకోవాలని ప్లాన్ చేశారు. మే1 సాయంత్రం.. హైదరాబాద్ నెక్లెస్ రోడ్‌లోని పీపుల్స్ ప్లాజా వేదికగా ఓపెన్ ఎయిర్‌లో ‘మహర్షి’ ప్రీ-రిలీజ్ ఈవెంట్ జరగనున్నట్లు ఫీలర్ బైటికొచ్చింది. ఇది.. ప్రిన్స్ 25వ సినిమా కావడంతో ఇంతవరకూ మహేష్‌తో 24 సినిమాలకు పని చేసిన డైరెక్టర్స్ అందరినీ ఈ వేడుకకు పిలవాలని నిర్మాతలు ప్లాన్ చేశారు. ఈవెంట్‌కి ఇదే స్పెషల్ ఎట్రాక్షన్ కానుందని, ఇప్పటికే అందుకోసం ఏర్పాట్లు షురూ అయ్యాయని చెబుతున్నారు. అశ్వనీదత్, పీవీపీ, దిల్ రాజు లాంటి బలమైన ప్రొడ్యూసర్ల మూవీ కనుక.. టాలీవుడ్ డైరెక్టర్ల జాతి మొత్తాన్ని ఈవెంట్‌కి పిలిపించడం పెద్ద కష్టమేమీ కాదు. ఆవిధంగా వేడుక విజయవంతం అయినా ఆశ్చర్యం లేదు.

సినిమా హైప్ కోసమే ఇదంతా చేస్తున్నారని, సినిమాలో పస లేదన్న విషయాన్ని ఈ విధంగా మేకర్స్ ధృవీకరించారని సోషల్ మీడియా అదేపనిగా రక్కేస్తోంది. గతంలో.. ‘భరత్ అనే నేను’ మూవీ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ని కూడా ఎల్బీ స్టేడియంలో అంగరంగ వైభవంగా నిర్వహించి.. తారక్‌ని చీఫ్ గెస్టుగా పిలిపించుకుని హడావుడి చేశారని విమర్శలున్నాయి. కానీ.. ముగ్గురు మెగా నిర్మాతల సినిమాగా ‘మహర్షి’ ఈవెంట్ అంటే ఆ మాత్రం హడావుడి ఉండొద్దు.. !

Related posts