telugu navyamedia
ఆరోగ్యం ట్రెండింగ్

కాన్సర్ రాకుండా.. ఈ గింజలు తింటే సరిపోతుందా..!

is sunflower seeds control cancer

భోజనం మనుకోమంటే భేషుగ్గా సరే అంటారు గాని, చిరు తిండి తినకుండా ఉండటం ఎవరి వలన కానిపని. అవి అలా నోట్లోకి ఎగరేస్తూ ఉంటె సరిపోతుంది. మరి అది ఏదో ఒకటి తీసుకుంటే సరిపోతుందా.. లేదా మనకు ఆరోగ్యాన్ని చేకూర్చేవి తీసుకుంటే మంచిదా.. అంటే, ఆరోగ్యానికి తగినవే తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అందులోను కొన్ని పదార్దాలు చాలా మేలు చేస్తాయి. ఈ పదార్దాలలో పొద్దుతిరుగుడు విత్తనాలు ప్రధానమైనవి. వీటితో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని నిపుణులు అంటున్నారు. అందులో కొన్ని .. తెలుసుకుందామా..

* పొద్దు తిరుగుడు విత్త‌నాల‌ను రోజూ తిన‌డం వ‌ల్ల ర‌క్తంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ పోయి, మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది.
* గుండె జ‌బ్బులు రాకుండా ఉంటాయి. ర‌క్త నాళాల్లో ఉండే కొవ్వు క‌రుగుతుంది.
* పొద్దు తిరుగుడు గింజలను రోజూ తింటే జీర్ణ‌స‌మ‌స్య‌లు తగ్గిపోతాయి. ముఖ్యంగా మ‌ల‌బ‌ద్ద‌కం త‌గ్గుతుంది.
* క్యాన్సర్ రాకుండా అడ్డుకునే ఎన్నో ఔషధ గుణాలు పొద్దు తిరుగుడు విత్తనాల్లో ఉంటాయి.
* వీటిని తినడం వల్ల ఎముకలు దృఢంగా మారుతాయి.
* మానసిక సమస్యలు పోతాయి. శరీర వాపులు తగ్గుతాయి. డయాబెటిస్ అదుపులో ఉంటుంది.
* శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. హైబీపీ కంట్రోల్ అవుతుంది. చర్మం, వెంట్రుకలకు సంరక్షణ కలుగుతుంది.

Related posts