telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

శృతిహాసన్ షాకింగ్ నిర్ణయం… మరి “వకీల్ సాబ్” సంగతి…?

Shruthi

పవన్ కల్యాణ్ హీరోగా బాలీవుడ్ ‘పింక్’ చిత్రానికి రీమేక్‌గా తెరకెక్కుతున్న చిత్రం ‘వకీల్ సాబ్’. ఈ చిత్రంలో శృతిహాసనే హీరోయిన్ అంటూ గత రెండు మూడు నెలలుగా వినిపిస్తుంది. ఆ మధ్య పరుచూరి పలుకులు‌లో కూడా పరుచూరి గోపాలకృష్ణ ఈ సినిమాలో శృతిహాసన్ అంటూ చెప్పుకొచ్చారు. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో చేయడానికి శృతిహాసన్ ఇంట్రస్ట్ చూపించడం లేదంట. ఎందుకంటే చాలా గ్యాప్ తర్వాత మళ్లీ ఎంట్రీ ఇస్తున్న శృతిహాసన్ తక్కువ నిడివి ఉన్న పాత్రలు, ఐటమ్ సాంగ్స్ వంటివి చేయకూడదనే నిర్ణయం తీసుకుందట. ఈ ‘పింక్’ రీమేక్ చిత్రంలో శృతిహాసన్ పాత్రకు అంతగా ప్రాముఖ్యత లేకపోవడంతో ఈ సినిమాలో చేసేందుకు ఆమె ఇష్టపడటం లేదని టాలీవుడ్ సర్కిల్స్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. మరి దీనిపై చిత్రయూనిట్ ఏమంటుందో తెలియాల్సి ఉంది. ఇక పవర్ స్టార్ పవన్ కల్యాణ్, శృతిహాసన్ కలిసి నటించిన ‘గబ్బర్‌సింగ్’ చిత్రం ఎటువంటి విజయాన్ని అందుకుందో అందరికీ తెలిసిందే. చాలా గ్యాప్ తర్వాత పవన్ కల్యాణ్‌కు అది బ్లాక్‌బస్టర్ హిట్. అలాగే శృతిహాసన్‌కు కూడా వరుస ప్లాప్‌ల తర్వాత వచ్చిన హిట్. అందుకే మళ్లీ పవన్‌తో సినిమా అనగానే టాలీవుడ్‌లో తనకు హిట్ ఇచ్చిన హీరో అని చెప్పి వెంటనే ‘కాటమరాయుడు’ సినిమా చేసేందుకు శృతి అంగీకరించింది. అయితే ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద సరైన విజయం అందుకోలేదు. ఇప్పుడు మళ్లీ వీరి కాంబినేషన్ గురించి వార్తలు వినిపిస్తున్నాయి.

Related posts