telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సినిమా వార్తలు

రజినీకాంత్.. దర్భార్ కు .. 108కోట్లు తీసుకున్నారా..

rajinikanth movie titled as darbar

నటుడు రజనీకాంత్ కెరీర్ లో మరో సినిమా చేదు అనుభవాన్ని మిగులుస్తుంది. అదే దర్బార్. పేరులో ఉన్న ఊపు సినిమాలో లేకపోవడంతో ఆ సినిమా ఆకట్టుకోలేదు. ఓ మోస్తరు వసూళ్లు వచ్చినా.. ఆ సినిమా బడ్జెట్ కు వాటితో సంబంధం లేకుండా పోయింది. ఆ సినిమా మేకింగ్ ఖర్చులో 50 శాతం వరకూ హీరో రెమ్యూనరేషనే వెళ్లిందనే టాక్ వినిపిస్తోంది. దర్భార్ సినిమా బడ్జెట్ దాదాపు రెండు వందల కోట్ల రూపాయలు కాగా.. అందులో 108 కోట్ల రూపాయలు రజనీకాంత్ తన రెమ్యూనరేషన్ గా తీసుకున్నారట.

రికార్డు స్థాయి పారితోషకంతో రజనీకాంత్ రికార్డే సృష్టించాడు కానీ ఇప్పుడు ఆ సినిమా వసూళ్లు తగు స్థాయిలో లేకపోవడంతో.. డిజాస్టర్ అనే విమర్శను ఎదుర్కొంటోంది. భారీ పారితోషకం తీసుకోవడం గొప్ప కావొచ్చు. అయితే తన సినిమా ఫెయిల్యూర్ అనేది ఏ హీరోకి అయినా అంత మంచి ప్రచారం కాదనే వాదన వినిపిస్తోంది.

Related posts