telugu navyamedia
ఆరోగ్యం ట్రెండింగ్

గర్భవతులు .. మేకప్ వేసుకోవచ్చా..?

Is pregnant makeup healthya

స్త్రీలు గ‌ర్భందాల్చిన స‌మ‌యంలో ఎన్నో జాగ్ర‌త్త‌ల‌ను పాటించాల్సి ఉంటుంది. ఆహారం, మందుల విష‌యంలో ఖచ్చితంగా వైద్యుల స‌ల‌హా మేర‌కు వ్య‌వ‌హ‌రించాల్సి ఉంటుంది. ఏ మాత్రం తేడా వ‌చ్చినా క‌డుపులో ఉండే బిడ్డ‌కే కాదు, త‌ల్లికి కూడా ప్రాణాంత‌క ప‌రిస్థితులు వ‌స్తాయి. ఈ క్ర‌మంలోనే గ‌ర్భిణీలు తాము నిత్యం తీసుకునే ఆహారం, మందుల విష‌యంలో చాలా జాగ్ర‌త్తా ఉండాలి. ఇవే కాకుండా మ‌రొక విష‌యంలో కూడా వారు జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని సైంటిస్టులు సూచిస్తున్నారు.

గ‌ర్భిణీలు.. లిప్‌స్టిక్‌, మాయిశ్చ‌రైజ‌ర్లు, ఇతర సౌంద‌ర్య సాధ‌నాల‌ను ఎక్కువ‌గా వాడ‌రాద‌ని, అస‌లు వాటికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని సైంటిస్టులు చెబుతున్నారు. అమెరికాలోని కొలంబియా యూనివర్సిటీకి చెందిన కొంద‌రు ప‌రిశోధ‌కులు గ‌ర్భంతో ఉన్న మేక‌ప్ వేసుకునే స్త్రీల‌ను ప‌రీక్షించారు.

Is pregnant makeup healthyaఈ క్ర‌మంలో తేలిందేమిటంటే.. గ‌ర్భం దాల్చిన స్త్రీలు మేక‌ప్ వేసుకోవ‌డం వ‌ల్ల వారి క‌డుపులో ఉండే బిడ్డ‌పై ఆ మేక‌ప్ సామ‌గ్రిలో ఉండే కెమిక‌ల్స్ ప్ర‌భావం ప‌డుతుంద‌ట‌. దీని వ‌ల్ల పుట్ట‌బోయే బిడ్డ‌ల‌లో చురుకుద‌నం లేక‌పోవ‌డం, మాన‌సిక ఆరోగ్యం సరిగ్గా ఉండ‌క‌పోవ‌డం.. వంటి స‌మ‌స్య‌లు వ‌స్తాయ‌ని తేల్చారు. అందువ‌ల్ల గ‌ర్భిణీలు మేక‌ప్ సామ‌గ్రికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిద‌ని సైంటిస్టులు హెచ్చ‌రిస్తున్నారు.

Related posts