సినిమా వార్తలు

రజిని అంత దమ్ము పవన్ కు వుందా ?

చిత్ర పరిశ్రమలో అత్యంత వివాదాస్పద వ్యక్తి రామ్ గోపాల్ వర్మ కొంత కాలం ట్విట్టర్ కి దూరంగా ఉండి తన తరపున నూతన సంవత్సరo తిరిగి ట్విట్టర్ లో యాక్టీవ్ అయ్యారు. వస్తూనే తన మార్క్ ట్వీట్స్ తో అందరి దృష్టి ఆకర్షించారు వర్మ. నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకునే పద్ధతిపై తన అభిప్రాయాన్ని తెలిపిన వర్మ కి అప్పుడే ప్రముఖ గాయని గీత మాధురి నుంచి ఘాటైన ప్రతి స్పందన వచ్చింది. ఇదిలా ఉంచితే తెలుగు, తమిళ రాష్ట్రాలలో స్టార్ హీరోస్ రాజకీయ రంగ ప్రవేశాలపై స్పందిస్తూ తన ట్విట్టర్ ద్వారా కొత్త అనుమానానికి తెర లేపారు వర్మ.

తమిళనాడు లో ప్రత్యక్ష రాజకీయాలకి వస్తూ రజనీకాంత్ రాష్ట్ర వ్యాప్తంగా వున్న 234 శాసనసభ స్థానాలలో పోటీకి దిగుతున్నట్టు ప్రకటన చేశారు కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా అన్ని స్థానాలలో పవన్ కళ్యాణ్ పోటీకి దిగుతారో లేదో ప్రకటించాలని లేకపోతే రజనీకాంత్ కి వున్న అంత దమ్ము ధైర్యం పవన్ కళ్యాణ్ కి లేవని అనుకోవాల్సి వస్తుంది అని రామ్ గోపాల్ వర్మ తన ట్వీట్ ద్వారా మరోసారి పవర్ స్టార్ పై చురకలు అంటించే ప్రయత్నం చేశారు.

Related posts

కట్టప్ప… మరో అరుదైన రికార్డు…

admin

ఆకట్టుకుంటున్న “అంధాధున్‌” ట్రైలర్

vimala t

'కాలా' ఆడియో విన్నారా…

admin

Leave a Comment