telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ

పాక్ అణ్వాయుధాలతో .. దాడికి సిద్ధం అవుతుందా.. !

pak will lose if war declared with india

భారత్, పాక్ భూభాగంలోని ఉగ్రస్థావరాలపై దాడి తర్వాత అణ్వాయుధాలు తరలించేందుకు ప్రయత్నించిందా? ఈ క్రమంలో అణ్వాయుధాలను ప్రయోగించేందుకు వాడే క్షిపణి ప్రమాదానికి గురైందా? ఈ ప్రశ్నలకు అవుననే సమాధానం వినిపిస్తోంది. ఫిబ్రవరి 26 దాడుల తర్వాత పాక్ అణుస్థావరాల్లో ఏదైనా కదలిక వచ్చిందా? అన్న సందేహంతో ఉపగ్రహ చిత్రాలను అధ్యయనం చేసిన నిపుణులు కదలికల విషయాన్ని గుర్తించారు. ఉపగ్రహ చిత్రాలను పరిశీలిస్తున్న నిపుణులకు బలూచిస్థాన్ ప్రాంతంలోని ఖుస్ద్ అణ్వాయుధ కేంద్రంలోని కొన్ని ఫొటోలు ఏదో తేడాగా ఉన్నట్టు అనిపించింది.

అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య ఉండే ఈ స్థావరంలో 46 అణువార్‌ హెడ్లను భద్రపరిచినట్టు అంచనా వేస్తున్నారు. నిజానికి ఇందులో 200 అణువార్ హెడ్లు, క్షిపణులను భద్రపరిచే సామర్థ్యంతో నిర్మించారు. ఈ నెల 8న ఉపగ్రహ చిత్రాలను పరిశీలించిన నిపుణులకు 200 మీటర్ల పొడవు, 100 మీటర్ల వెడల్పున అగ్నిప్రమాదం జరిగినట్టు అక్కడి పరిస్థితులను బట్టి గుర్తించారు. ఆ మేరకు భూమిపై పెద్ద మచ్చ కనిపిస్తోంది. ఖచ్చితంగా ఇక్కడ ఏం జరిగిందన్న విషయాన్ని నిపుణులు చెప్పలేకపోతున్నప్పటికీ క్షిపణి పేలడం వల్ల అగ్ని ప్రమాదం సంభవించి ఉండొచ్చని భావిస్తున్నారు.

Related posts