telugu navyamedia
రాజకీయ

ఆర్థిక నేరస్తుడు నీరవ్ .. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ వినీత్ అగర్వాల్ ని .. బదిలీ చేశాడా.. !

nirav modi got golden visa
ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ వినీత్ అగర్వాల్, ఆర్థిక నేరస్థులైన నీరవ్ మోడీ, విజయ్ మాల్యా కేసు విచారణాధికారి బదిలీ విషయంలో చిక్కుల్లో పడ్డారు. ఆయనపై కేంద్రం తప్పుడు నిర్ణయం తీసుకున్నారంటూ బదిలీ వేటు వేసింది. ఈ మేరకు ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. మార్చి 29న లండన్ కోర్టులో నీరవ్ మోడీ కేసు విచారణ జరిగింది. కేసుకు సంబంధించి ఈడీ తరఫున జాయింట్ డైరెక్టర్ సత్యబ్రత కుమార్ విచారణకు హాజరయ్యారు. ఆ సమయంలో ఆయనను ఆకస్మికంగా ట్రాన్స్‌ఫర్ చేస్తూ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ వినీత్ అగర్వార్ ఉత్తర్వులు జారీ చేశారు. 
ఈ నిర్ణయాన్ని తప్పుబట్టిన కేంద్రం వినీత్‌పై బదిలీ వేటు వేసింది. అతన్ని తన కేడర్‌కు తిప్పి పంపింది. 1994 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన వినీత్ అగర్వాల్ మహారాష్ట్ర కేడర్ అధికారి. 2017లో ఆయనను ఎన్‌ఫోర్స్‌మెంట్ స్పెషల్ డైరెక్టర్‌గా నియమించారు. ఆయన ఐదేళ్ల పాటు పదవిలో కొనసాగాల్సి ఉండగా.. నీరవ్ మోడీ కేసు విషయంలో తీసుకున్న తప్పుడు నిర్ణయంతో కేంద్రం బదిలీ వేటు వేసింది.  

Related posts