telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

హీరోయిన్ తో మరో క్రికెటర్ ప్రేమాయణం

KL-Rahul

జాతీయ క్రికెట‌ర్ జ‌స్ర్పీత్ బుమ్రా, ద‌క్షిణాదికి చెందిన హీరోయిన్ అనుప‌మా ప‌ర‌మేశ్వ‌ర‌న్ ప్రేమ‌లో ఉన్నారా? అనే విషయం సోష‌ల్ మీడియాలోనే కాకుండా జాతీయ మీడియాలో సైతం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. అయితే ఈ విషయాన్ని గతంలో మీడియా అనుపమ వద్ద ప్రస్తావించగా… “నో కామెంట్స్” అంటూ సమాధానం దాటవేసింది. ఇప్పుడు ప్రముఖ మోడల్ తో మరో క్రికెటర్ ప్రేమాయణం ఫిల్మ్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. ప్రముఖ మోడల్, బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్ ప్రాణ స్నేహితురాలు ఆకాంక్ష రంజన్‌ కపూర్‌తో రాహుల్ ప్రస్తుతం కలిసి తిరుగుతున్నాడు. రాహుల్, అతియా శెట్టితో కలిసి దిగిన ఫోటోను ఆకాంక్ష ఇటీవల తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసింది. “ఈ ప్రేమతో నేను చాలా సంతోషంగా ఉన్నాను” అని కామెంట్ కూడా చేసింది. దీంతో రాహుల్, ఆకాంక్ష ప్రేమలో ఉన్నారని వార్తలు మొదలయ్యాయి. ఈ వార్తపై రాహుల్ స్పందిస్తూ “మీడియా ఏం రాసిందో నాకు తెలియదు. నేను వార్తలు పెద్దగా చదవను. కాబట్టి, నా గురించి ఏం రాశారనేది తెలీదు. నేను వ్యక్తిగత జీవితాన్ని గోప్యంగా ఉంచడానికే ఇష్టపడుతాను. నా వ్యక్తిగత వ్యవహారాల గురించి బహిరంగంగా మాట్లాడటం ఇష్టం ఉండదు” అంటూ అసలు విషయాన్ని దాటవేశాడు. అయితే క్రికెటర్లు హీరోయిన్లను ఇష్టపడడం అనేది కొత్తేమీకాదు. ఇదివరకే అనుష్క శర్మ, విరాట్ కోహ్లీ లవ్ మ్యారేజ్ చేసుకున్న విషయం తెలిసిందే.

Related posts