telugu navyamedia
సినిమా వార్తలు

ఇలియానా ప్రెగ్నెంట్…!!?

Ileana

గోవా బ్యూటీ ఇలియానా ప్రెగ్నెంట్ అని చాలాకాలంగా వార్తలు విన్పిస్తున్నాయి. ఈ విషయంపై ఇలియానా ఇప్పటివరకూ స్పందించలేదు. దీంతో ఆమె గర్భవతి అంటూ మీడియాలో, సోషల్ మీడియాలో పలు కథనాలు ప్రచురితం అవుతున్నాయి. ప్రస్తుతం ఇలియానా బాలీవుడ్ లో ఒక్క సినిమాలో మాత్రమే నటిస్తుంది. ఈ సినిమాలో జాన్ అబ్రహం హీరోగా నటిస్తున్నాడు. సినిమా షూటింగ్ మొదలై రెండు నెలలు కావొస్తుంది. అయితే సడెన్ గా ఇలియానా ఈ సినిమా నుండి తప్పుకున్నట్లు తెలుస్తోంది. దీంతో ఆమె గర్భవతి కావడం వల్లే సినిమా నుంచి తప్పుకుందనే వార్తలు మరోసారి గుప్పుమన్నాయి. ప్రస్తుతం ఈ బ్యూటీ చేతిలో ఒక్క సినిమా కూడా లేదు. సౌత్ లో రెండు సినిమాల ఆఫర్స్ వస్తే వాటిని కూడా పక్కన పెట్టేసింది. గత కొంతకాలంగా ఇలియానా ఓ ఫారెన్ ఫోటోగ్రాఫర్ తో డేటింగ్ చేస్తున్న వ్ విషయం తెలిసిందే. వీరిద్దరూ కలిసి తీసుకున్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటుంది ఈ బ్యూటీ. ఈ జంటగా సీక్రెట్ గా పెళ్లి కూడా చేసుకున్నారని టాక్. ప్రస్తుతం ముంబైలో వీరిద్దరూ కలిసే జీవిస్తున్నారు. ఇక రవితేజ చిత్రం “అమర్ అక్బర్ ఆంటోనీ”తో ఇలియానా టాలీవుడ్ లోకి రీఎంట్రీ ఇచ్చింది. కానీ హిట్ ను అందుకోలేకపోయింది.

Related posts