telugu navyamedia
ఆరోగ్యం ట్రెండింగ్

రోజు గ్రీన్ టీ తో.. అధికబరువు తగ్గొచ్చా..?

green tea

ఏమి తింటున్నామో తెలియకుండా.. రోజు లో ఏదో ఒకటి తినేసి ఆకలికి సమాధానం చెపుతున్నారు. కానీ, ఈ విధంగా ఏదో ఒకటి కడుపులో పడేస్తుంటే, దీర్ఘకాలంలో అధికబరువు సమస్య వచ్చే అవకాశం ఉంది. ఈ సమస్య ఇప్పటికే కొన్ని తరాలను పట్టి పీడిస్తూనే ఉంది. దానికి కారణంగా ఆహారపు అలవాట్లు అనేది ప్రధానంగా వినిపిస్తుంది. ఇక ఆ బరువు తగ్గడానికి కూడా అదేవిధంగా అనేక మార్గాలలో ప్రయత్నిస్తూనే ఉన్నారు. దానిలో గ్రీన్ టీ ఒకటి.. దానితో ఈ టీ కి ప్రాధాన్యత పెరిగిపోయింది. అయితే దీనిని ఎలా తీసుకోవాలి అనేది తెలుసుకోవాలి.

గ్రీన్ టీ తాగితే మ‌న‌కు ఎన్నో ఆరోగ్య‌క‌ర ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయ‌ని అంద‌రికీ తెలిసిందే. గ్రీన్ టీ తాగ‌డం వ‌ల్ల అధిక బ‌రువు త‌గ్గ‌వ‌చ్చ‌ని వైద్యులు చెబుతుంటారు. అయితే చాలా మందికి.. గ్రీన్ టీ తాగితే అధిక బ‌రువు త‌గ్గుతారా ? అనే ఒక సందేహం ఉంటుంది. ఆ సందేహానికి ఇక చెక్ ప‌డిన‌ట్లే. ఎందుకంటే గ్రీన్ టీ తాగితే అధిక బ‌రువు త‌గ్గుతార‌ని సైంటిస్టులు చేప‌ట్టిన తాజా ప‌రిశోధ‌న‌ల్లో తెలిసింది.

ginger tea for all round healthఓహియో స్టేట్ యూనివ‌ర్సిటీకి చెందిన ప‌రిశోధ‌కులు ఇటీవ‌లే ఎలుక‌లపై ఒక ప‌రిశోధ‌న చేశారు. గ్రీన్ టీ పౌడ‌ర్‌ను 8 వారాల పాటు కొన్ని ఎలుక‌ల‌కు ఇచ్చారు. దీనితో వాటిలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ త‌గ్గింద‌ట‌. అలాగే బ‌రువు కూడా త‌గ్గాయ‌ని గుర్తించారు. అందువ‌ల్ల వారు చెబుతున్న‌దేమిటంటే.. గ్రీన్ టీ తాగ‌డం వ‌ల్ల ఒబెసిటీ రాకుండా ఉంటుంద‌ని, వ‌చ్చినా గ్రీన్ టీ తాగితే బ‌రువు త‌గ్గుతార‌ని, అలాగే జీర్ణాశ‌యంలో వాపులు త‌గ్గుతాయ‌ని, డ‌యాబెటిస్ అదుపులో ఉంటుంద‌ని వారు చెబుతున్నారు. క‌నుక ఎవ‌రైనా స‌రే.. నిత్యం గ్రీన్ టీని తాగుతుంటే అధిక బ‌రువును ఖచ్చితంగా త‌గ్గించుకోవ‌చ్చు. అలాగే ముందు చెప్పిన ఇతర అనారోగ్య స‌మ‌స్య‌లు కూడా త‌గ్గిపోతాయి..!

Related posts