telugu navyamedia
ఆరోగ్యం ట్రెండింగ్

వేసవిలో బీర్ ఆరోగ్యకరమేనా ?

beer

వేసవిలో దాహాన్ని తట్టుకోలేక చాలామంది చల్లని నీళ్లు తాగేస్తుంటారు. వీటితోపాటు శీతల పానియాలు, ఫ్రూట్ జ్యూస్‌లు తినేవాళ్లు కూడా ఎక్కువే. ఇక మందుబాబులైతే ఎండల్లో చల్లని బీరు తాగితే ఆ కిక్కే వేరబ్బా అనుకుంటూ ఉంటారు. బీర్లు తమని వేసవి తాపం నుంచి బయటపడేస్తాయని నమ్ముతారు. వాస్తవానికి అది అపోహ మాత్రమే. వేసవిలో బీర్లు తాగడం ఆరోగ్యానికి ఏ మాత్రం మంచిది కాదని తాజా పరిశోధనలు తెలుపుతున్నాయి. శరీరంలో ఏడీహెచ్ అనే హార్మోన్ ఉంటుంది. అది శరీరంలోని నీటి శాతాన్ని నియంత్రిస్తుంది. ఆల్కహాల్ కలిసిన బీరు తాగడం వల్ల ఈ హార్మోన్ దెబ్బతింటుంది. ఈ నేపథ్యంలో వేసవిలో బీర్లకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. కేవలం బీరు మాత్రమే కాదు.. ఇతరాత్ర ఆల్కహాల్‌ల వల్ల కూడా శరీరానికి నష్టమే. చల్లటి బీరు వల్ల శరీరంలో వేడి మరింత పెరిగి కొత్త సమస్యలను తెలుస్తుందని పరిశోధకులు తెలిపారు. బీరుకు బదులు జ్యూస్‌లు, కొబ్బరినీళ్లు, మజ్జిగ లాంటివి తీసుకుంటే ఆరోగ్యానికి మంచిదని చెబుతున్నారు. వీటిని తీసుకోవడం ద్వారా డీహైడ్రేషన్ సమస్య నుంచి బయటపడొచ్చు. కిక్కు కోసం అప్పుడప్పుడు బీర్లు, ఇతరాత్ర ఆల్కహాల్‌ను పుచ్చుకున్నా.. తక్కువ మోతాదులోనే తీసుకుంటే మంచిది.

Related posts