telugu navyamedia
health Sexual Problems

డర్టీ టాక్‌తో హ్యాపీ రొమాన్స్..

sex

మంచి రొమాంటిక్ టైమ్‌ని గడిపేందుకు ప్రతి జంట అనేక విషయాలు తెలుసుకోవాలి. అప్పుడే మీతో పాటు, ఎదుటివారు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇందులో ముఖ్యమైన విషయం ఏంటంటే.. మాట్లాడుకోవడం.. అవును సాధారణంగా దంపతులు అన్ని విషయాలు అందరూ మాట్లాడుకోరు. బెడ్ రూమ్‌లో మాట్లాడుకునే విషయాలు కొన్ని ఉంటాయి. వాటిని అందరి ముందు మాట్లాడుకోలేరు. శృంగారంలో ఎంతగా సిగ్గుని విడిస్తే అంతగా సుఖపడతారు. దీని వల్ల ఒకరి గురించి ఒకరికి అర్ధమవుతుంది. ఆనందంగా సమయాన్ని గడుపుతారు. ఇక బూతులు మాట్లాడే విషయానికొస్తే ఇది కొంతమందికి ఇష్టముంటే, మరికొంతమందికి ఇష్టముండదు. అయితే చాలా మందికి బూతులు ఆ టైమ్‌లో మాట్లాడితే బూస్ట్ ఇచ్చినట్లుగా ఉంటుందట. దీంతో ఆ కార్యాన్ని బాగా ఎంజాయ్ చేస్తారట. శృంగారంలో పాల్గొనే ఇద్దరికి ఇది ఇష్టమైతే హ్యాపీగా బూతులు మాట్లాడుకోవచ్చట. ఇది ఏం తప్పు కాదని చెబుతున్నారు.

అయితే, ఇలా బూతులు మాట్లాడడం అందరికీ ఇష్టం ఉండదు. కొంతమంది దీనిని ఇబ్బందిగా ఫీల్ అవుతారు. వారి దగ్గర జాగ్రత్తగా ఉండాలి. ముందు వారికి ఏం ఇష్టమో తెలుసుకుని అలా ఉండడం మంచిది. మీకు అంతగా మాట్లాడాలనిపిస్తే అది హద్దుల్లో ఉంటే పర్లేదా అని కనుక్కోని మాట్లాడండి. దీంతో మీ ఇద్దరి మధ్య ఓ అవగాహన వస్తుంది. దాంతో మీ రొమాంటిక్ టైమ్‌కి రెక్కలు వచ్చినట్టే. ఇద్దరు కూడా మంచి టైమ్‌ని గడిపిన వారవుతారు. డర్టీ టాక్ అనేది రొమాన్స్‌కి బూస్ట్ ఇస్తుందని చెబుతున్నారు నిపుణులు. ఇదేదో ఆషామాషీగా చెప్పిన లెక్కలు కాదని వారు చెబుతున్నారు. ఇదే అంశంపై సూపర్ డ్రగ్ ఆన్ లైన్ డాక్టర్ సర్వే చేపట్టింది. ఇందులో పాల్గొన్న దంపతులని పరీక్షించిన నిపుణులు.. ఇంట్రెస్టింగ్ విషయాలను తెలిపారు. దాదాపు 29 శాతం మంది శృంగారంలో పాల్గొన్నప్పుడు బూతులు డర్టీ టాక్‌తో ఆ టైమ్‌ని పూర్తిగా ఆస్వాదించినట్లు చెబుతున్నారు.

Related posts

వ్యాయామం తరువాత .. ఈ నీరే తాగాలి..

vimala p

సహజ సౌందర్యానికి.. ఇలా ..

vimala p

ఎండలలో .. తక్షణ శక్తినిచ్చేవి ఇవే.. !

vimala p