telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

దీపికా పదుకొనె తల్లి కాబోతోందా ?

ranveer singh

స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనె బాలీవుడ్ లో అత్యధిక పారితోషికం తీసుకునే హీరోయిన్లలో ఒకరు. ఆమె నటనాపరంగానే కాకుండా గ్లామర్ పరంగా కూడా యూత్ లో భారీ క్రేజ్ ను సొంతం చేసుకుంది. ఇక ఈ మెరుపుతీగ బాలీవుడ్ స్టార్ కపుల్ రణ్వీర్ సింగ్ ను గత సంవత్సరం పెళ్ళి చేసుకున్న విషయం తెలిసిందే. కొన్నేళ్ల పాటు ప్రేమలో ఉన్న వీరిద్దరూ చివరకు వివాహం చేసుకున్నారు. ఆన్ స్క్రీన్ పై కూడా వీరిద్దరూ సూపర్ హిట్ జోడిగా నిలిచారు. ప్రస్తుతం ఈ జంట త్వరలో తల్లిదండ్రులు కాబోతున్నారంటూ జోరుగా ప్రచారం సాగుతోంది. దీపికా పదుకొనె ప్రస్తుతం గర్భవతిగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. దీపికా ఇటీవల సోషల్ మీడియాలో చేసిన ఓ పని ఈ ఊహాగానాలకు బలం చేకూర్చింది. ఇటీవల రణవీర్ సింగ్ ఇన్స్టాగ్రామ్ లో అభిమానులతో చాట్ సెషన్ నిర్వహిస్తున్నాడు. దీపికా కూడా కొంత సమయం తర్వాత ఈ చాట్ సెషన్ లో జాయిన్ అయింది. అభిమానులతో పాటు దీపికా కూడా రణవీర్ కు ఓ మెసేజ్ పెట్టింది. ఒక బేబీ ఎమోజిని పోస్ట్ చేసి దానికి “హాయ్ డాడీ” అని కామెంట్ పెట్టింది. కొద్దిసేపటికే అర్జున్ కపూర్ కూడా రణవీర్ ని ఉద్దేశించి “రణవీర్ భయ్యా.. వదిన నీకో సర్ ప్రైజ్ ఇవ్వబోతోంది” అని కామెంట్ చేశాడు. దీంతో దీపికా త్వరలో తల్లి కాబోతోందని అభిమానుల్లో చర్చ జరుగుతోంది.

Related posts