రాజకీయ వార్తలు వార్తలు

చంద్ర‌బాబు ఆ చారిత్ర‌క త‌ప్పిదం చేస్తారా…?

tdp asking 10 seats in greater hyderabad
ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో ఎన్నికల వేడి రాజుకుంటోంది. ముంద‌స్తు అయినా, షెడ్యూల్ ప్ర‌కార‌మే జ‌రిగినా..ఎన్నిక‌లకు ఎక్కువ గ‌డువులేక‌పోవ‌డంతో….పొత్తుల‌పై పెద్ద ఎత్తున ఊహాగానాలు సాగుతున్నాయి విభ‌జ‌న త‌ర్వాత గ‌త  ఎన్నిక‌ల్లో బీజేపీతో క‌లిసి పోటీచేసిన టీడీపీ…ఈ ఎన్నిక‌ల‌నాటికి ఆ పార్టీతో మైత్రీబంధం తెంచుకుంది. మ‌రో మిత్ర‌ప‌క్షం జ‌న‌సేన‌కు కూడా దూరం జ‌రిగింది.
Another leader resigned in the ycp
ఏపీలో స్థానికంగా ఉన్న ప‌రిస్థితుల‌తో పాటు మ‌రో తెలుగు రాష్ట్రం తెలంగాణ‌లోనూ, జాతీయ‌స్థాయిలోనూ నెల‌కొని ఉన్న‌ రాజకీయ ప‌రిణామాల దృష్ట్యా టీడీపీ ఈ సారి కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోనుంద‌న్న విశ్లేష‌ణ‌లు వెలువడుతున్నాయి. రెండు పార్టీల మ‌ధ్య రెండు రాష్ట్రాల్లో దాదాపు పొత్తు ఖ‌రార‌యిన‌ట్టేన‌ని, సీట్ల స‌ర్దుబాటు జ‌రుగుతోంద‌ని వార్త‌లొస్తున్నాయి. ఈ ఊహాగానాల్లో ఎంతవ‌ర‌కు నిజ‌ముందో తెలియ‌దు కానీ అనుకున్న‌ట్టుగా ఈ పొత్తు కార్య‌రూపం దాల్చితే మాత్రం టీడీపీకి కోలుకోలేని దెబ్బ త‌గులుతుంది.
congress leader pantam into janasena soon
ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు, కాంగ్రెస్ నేత‌లు ఎంత‌గా ఈ పొత్తును స‌మ‌ర్ధించుకునే ప్ర‌య‌త్నం చేసిన‌ప్ప‌టికీ..తెలుగు రాష్ట్రాల ప్ర‌జ‌లు, సాధార‌ణ టీడీపీ కార్య‌క‌ర్త‌లు  తెలుగుదేశం, కాంగ్రెస్ మైత్రీ బంధాన్ని ఎంత మాత్రం స‌హించ‌బోరు.  నిజానికి టీడీపీ ఆవిర్భావంలోనే కాంగ్రెస్ వ్య‌తిరేక‌త ఉంది. టీడీపీ ఏర్ప‌డింది..త‌ర్వాత రాజ‌కీయంగా ఎదిగిందీ…కాంగ్రెస్ వ్యతిరేక పునాదులు పైనే. టీడీపీ సిద్ధాంతాల్లో అధికారికంగా లేక‌పోయిన‌ప్ప‌టికీ…కాంగ్రెస్ ఆ పార్టీకి ఆగ‌ర్భ శ‌త్రువు. ఈ నేప‌థ్యానికి తోడు….కాంగ్రెస్ త‌ల‌పై ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఏక‌ప‌క్ష విభ‌జ‌న పాపం ఉంది.
విభ‌జ‌నతో ఆంధ్ర‌ప్ర‌దేశ్ కు కాంగ్రెస్ చేసిన ద్రోహాన్ని రాష్ట్ర ప్ర‌జ‌లెవ‌రూ మ‌ర్చిపోలేదు. మ‌ర్చిపోయార‌ని, బీజేపీ మీద వ్య‌తిరేక‌త‌తో మ‌ర్చిపోయేలా చేద్దామ‌ని చంద్ర‌బాబు అనుకుంటే…అంత‌కుమించిన చారిత్ర‌క త‌ప్పిదం ఉండ‌దు. విభ‌జన హామీలు నెర‌వేర్చ‌క‌పోవ‌డం, ఏపీని చిన్న‌చూపు చూడ‌డం వంటి బీజేపీ త‌ప్పుల‌ను ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌జ‌లు గ‌మ‌నిస్తున్నార‌న‌డంలో కానీ, బీజేపీ నిర్లక్ష్యపూరిత‌వైఖ‌రిపై ఆగ్ర‌హంతో ఉన్నార‌న‌డంలో కానీ..ఎలాంటి సందేహం లేదు.
bjp
అయితే ఆ ఆగ్ర‌హం కాంగ్రెస్ పై సానుకూల‌తను పెంచే స్థాయిలో అయితే లేద‌న్న‌ది ఖ‌చ్చితంగా చెప్ప‌వ‌చ్చు. కాంగ్రెస్ క‌న్నా ఎక్కువ‌గా బీజేపీని రాష్ట్ర‌ప్ర‌జ‌లు ద్వేషిస్తున్నార‌న్న అంచనాలు త‌ప్పు. విభ‌జ‌న స‌మ‌యంలో ఏపీ ప్ర‌జ‌ల మ‌నోభావాల‌ను, హ‌క్కుల‌ను కాంగ్రెస్ ఏ మాత్రం ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోలేదని,  ద‌శాబ్దాలుగా ఏపీ ప్ర‌జ‌లు అభివృద్ది చేసిన హైద‌రాబాద్ ను కూడా తెలంగాణ‌కు కేటాయించ‌డం ద్వారా ఆంధ్ర‌ప్ర‌దేశ్ కు తీవ్ర అన్యాయంచేసిందని పార్టీల‌క‌తీతంగా ఏపీ ప్ర‌జ‌లు భావించారు.
ఇదే విభ‌జ‌న త‌ర్వాత జ‌రిగిన ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ ను ఏపీలో తుడిచిపెట్టింది. క‌రుడుగ‌ట్టిన కాంగ్రెస్ ఓటర్లుగా ఉండేవారు సైతం గ‌త ఎన్నిక‌ల్లో ఆ పార్టీకి ఓటేయలేదు. ఒక్క మాట‌లో చెప్పాలంటే ఏపీ ప్ర‌జ‌ల ఆగ్ర‌హం ఏ స్థాయిలో ఉంటుందో గ‌త ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ కు తెలిసొచ్చింది. ఆ దెబ్బ‌కు రాష్ట్రంలో బ‌ల‌పడేందుకు ఏమి చేయాలో కూడా తెలియ‌ని దిక్కుతోచ‌ని స్థితికి కాంగ్రెస్ చేరింది. నాలుగ‌న్న‌రేళ్ల కాలంలో కాంగ్రెస్ ప‌రిస్థితి రాష్ట్రంలో ఏమాత్రం మెరుగుప‌డ‌లేదంటే ఏపీ ప్ర‌జ‌ల్లో ఆ పార్టీపై ఎంత ఆగ్ర‌హం ఉందో అర్ధంచేసుకోవ‌చ్చు. ప్ర‌త్యేక హోదాకు విస్ప‌ష్ట మ‌ద్ద‌తు ప్ర‌క‌టించి, హోదాకు అనుకూలంగా సీడ‌బ్ల్యుసీలో తీర్మానం చేయ‌డంతో కాంగ్రెస్ పై ప్ర‌జ‌ల్లో ఆగ్ర‌హం చ‌ల్లారింద‌ని ముఖ్య‌మంత్రి భావిస్తుండొచ్చు.
కానీ కాంగ్రెస్ చేసిన తీర‌ని ద్రోహాన్ని ఈ ప్ర‌క‌ట‌న‌ల‌తో ప్ర‌జ‌లు మ‌ర్చిపోతార‌నుకోవ‌డం స‌రైన ఆలోచ‌న కాదు. కాంగ్రెస్, టీడీపీ పొత్తును టీడీపీ కార్య‌క‌ర్త‌లే కాదు..ఏపీ ప్ర‌జ‌లు కూడా అనైన‌తిక‌, అస‌హజ పొత్తుగానే భావిస్తారు. ఇది టీడీపీ విశ్వ‌స‌నీయ‌త‌ను దెబ్బ‌తీస్తుంది. అంతిమంగా పార్టీకి పూడ్చ‌లేని న‌ష్టం చేకూరుస్తుంది. జాతీయ రాజ‌కీయాల ప‌రిస్థితులు, తెలంగాణలో అవ‌స‌రాలు, విభ‌జ‌న బాధిత ఏపీకి ఓ జాతీయ పార్టీ మ‌ద్ద‌తు త‌ప్ప‌నొసరి వంటి ఎన్ని కార‌ణాలను టీడీపీ చెబుతున్న‌ప్ప‌టికీ….పార్టీ కార్య‌క‌ర్త‌లు, ఓట‌ర్లు ఈ తీర్పును ఏ ప‌రిస్థితుల్లోనూ స్వాగ‌తించ‌లేరు. ఏపీ, తెలంగాణ‌ల్లో కాంగ్రెస్ తో పొత్తుపెట్టుకుని టీడీపీ ఎన్నిక‌ల‌కు వెళ్లిన‌ట్ట‌యితే…పార్టీ ప‌త‌నాన్ని చేతులారా ఆహ్వానించిన‌ట్టే.
కొన్ని నెల‌లుగా బీజేపీ, టీడీపీ మ‌ధ్య ప‌చ్చ‌గ‌డ్డి వేస్తే భ‌గ్గుమ‌నే ప‌రిస్థితులు, ఎన్డీఏ ప్ర‌భుత్వం నుంచి టీడీపీ బ‌య‌ట‌కు రావ‌డం, లోక్ స‌భ‌లో మోడీ ప్ర‌భుత్వంపై టీడీపీ ఎంపీలు అవిశ్వాసం పెట్ట‌డం వంటి ప‌రిణామాలు జ‌రిగిన‌ప్ప‌టికీ… కాంగ్రెస్ ను ద్వేషించినంత‌గా రాష్ట్ర ప్ర‌జ‌లెవ‌రూ బీజేపీని ద్వేషించ‌డం లేదు. …ఏవ‌న్నా అనూహ్య ప‌రిణామాలు చోటుచేసుకుని ఎన్నిక‌ల‌నాటికి టీడీపీ, బీజేపీ మ‌ధ్య మ‌ళ్లీ పాత స్నేహం చిగురిస్తే…ఆ బంధాన్ని అంగీక‌రించ‌డానికి కూడా ఏపీ ప్ర‌జ‌లు సిద్ధంగా ఉంటారు కానీ టీడీపీ, కాంగ్రెస్ పొత్తును మాత్రం వారు ఆమోదించ‌రు.
congress
రాష్ట్రంలో, దేశంలో కాంగ్రెస్ ప్రాభ‌వం కోల్పోయిన‌ప్ప‌టికీ….ఏపీ ప్ర‌జ‌ల్లో ఆ పార్టీపై సానుభూతి ఏమీ లేదు. ఇంకా చెప్పాలంటే ఏపీకి చేసిన అన్యాయానికి కాంగ్రెస్ త‌గిన శిక్ష అనుభ‌విస్తోంద‌న్న భావ‌న‌లో ఉన్నారు. ఇప్పుడే కాదు..మ‌రో నాలుగైదేళ్ల పాటు  ప్ర‌జ‌ల్లో ఇదే అభిప్రాయం ఉంటుంది. ఇలాంటి ప‌రిస్థితుల్లో కాంగ్రెస్ తో చంద్ర‌బాబు క‌లిసి వెళ్తే టీడీపీపైనా వ్య‌తిరేక‌త పెరుగుతుంది. కాంగ్రెస్ చేసిన ఏక‌ప‌క్ష  విభ‌జ‌న వ‌ల్ల స‌ర్వ‌స్వం కోల్పోయి…దిక్కుమొక్కూ లేకుండా ప‌డి ఉన్న రాష్ట్రాన్ని చంద్ర‌బాబు అయితే గాడిన పెట్ట‌గ‌లర‌ని భావించిన ప్ర‌జ‌లు ఆయ‌న‌కు అధికారం అప్ప‌గించారు.
రాజ‌ధాని నిర్మాణం నాలుగేళ్ల‌కాలంలో అనుకున్నంత వేగంగా సాగ‌క‌పోయిన‌ప్పటికీ…మిగిలిన‌ అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌పై ప్ర‌జ‌లు సంతృప్తిగానే ఉన్నారు. మ‌రోసారి టీడీపీ అధికారంలోకి వ‌స్తే…ఆంధ్ర‌ప్ర‌దేశ్ రూపురేఖ‌లు మార‌తాయ‌ని, అమ‌రావ‌తిని  అంత‌ర్జాతీయస్థాయి రాజ‌ధానిగా చంద్ర‌బాబు తీర్చిదిద్దుతార‌ని ప్ర‌జ‌లు న‌మ్ముతున్నారు. ఎన్నిక‌ల్లో ఆయ‌న వెంట నిల‌వ‌డానికి సిద్ధ‌మవుతున్నారు. ఇలాంటి ప‌రిస్థితుల్లో ముఖ్యమంత్రి ఏపీకి ద్రోహం చేసిన కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుంటే..అది ప్ర‌జ‌ల‌కు త‌ప్పుడు సంకేతాలు పంపిస్తుంది. అంతిమంగా టీడీపీ గెలుపుపై తీవ్ర ప్ర‌భావం చూపుతుంది. దేశంలోనే అత్యంత సీనియ‌ర్ రాజ‌కీయ‌నాయ‌కుడిన‌ని చెప్పుకుంటున్నముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు…ఇలాంటి చారిత్ర‌క త‌ప్పు చేయ‌కూడ‌ద‌ని రాజ‌కీయ ప‌రిశీల‌కులు సూచిస్తున్నారు. 
-కమలాదేవి

Related posts

మొత్తానికి ఎన్టీఆర్ ని రంగంలోకి ధించిన చంద్రబాబు …రేపే నామినేషన్

jithu j

ఘనంగా ప్రారంభమైన టీఆర్ఎస్ ప్లీనరీ

admin

చైనాలో 4వేల పోర్న్ సైట్లు బ్లాక్

jithu j

Leave a Comment