telugu navyamedia
culture health news trending

క్యాన్సర్‌ .. వంశపారంపర్యంగా వస్తుందా..

is cancer inherited disease

కుటుంబ సభ్యుల్లో ఎవరైనా క్యాన్సర్‌ బారిన పడి ఉంటే, ఆ కుటుంబ వారసులూ జాగ్రత్తగా ఉండాలా! అసలు వంశపారంపర్యంగా ఈ వ్యాధి వ్యాపిస్తుందా.. తెలుసుకుందాం.. సాధారణంగా క్యాన్సర్‌ వ్యాధి బారిన పడి చనిపోయిన కుటుంబ చరిత్ర ఉంటే వాళ్ల వారసులకు ఈ వ్యాధి సోకే ప్రమాదం ఎక్కువగానే ఉందని నిపుణులు చెపుతున్నారు. దీనికి స్త్రీ, పురుషులు, వయసు వంటి అంశాలతో సంబంధం లేదు. ఎవరికైనా రావచ్చు. అయితే మా తాతగారి కాలంలో క్యాన్సర్‌ వ్యాధికి సరైన చికిత్సే కాదు… దానిని ముందుగా కనిపెట్టేందుకు తగినంత వైద్యపరిజ్ఞానం కూడా లేదు. దాంతో అప్పట్లో క్యాన్సర్‌ పదం వింటేనే ఆ వ్యాధి బారిన పడ్డవారిపై ఆశలు వదులుకునేవారు. కానీ ఇప్పుడు పరిస్థితిలో చాలా మార్పు వచ్చింది. అత్యాధునిక వైద్యపరిజ్ఞానంతో పాటు నిపుణులైన డాక్టర్లు కూడా ఇప్పుడు అందుబాటులో ఉన్నారు. అంతేకాదు ముఖ్యంగా ఈ క్యాన్సర్‌వ్యాధిని ముందే గుర్తించే అధునాతనమైన వైద్య పరికరాలు, ఉపకరణాలు, వైద్య పరీక్షలు, ఇతరత్రా అనేక ప్రక్రియలు మనకు అందుబాటులోకి వచ్చాయి.సాధారణంగా ఏ రకమైన క్యాన్సర్‌నైనా మొదటిదశలోనే గుర్తిస్తే దాన్ని సమూలంగా రూపుమాపవచ్చు.

దీనిని సకాలంలో గుర్తిస్తే దాదాపు 75 శాతం వరకు దీనిని ఎదుర్కొనే వైద్యసదుపాయాలు ఉన్నాయి. కానీ దీని బారిన పడ్డవారు చివరిదశలో చికిత్సకోసం వస్తే మాత్రమే వారి జీవితానికి 25 శాతం హామీ ఉంటుంది. అందుకని ఆయా కుటుంబాలలో వారసులందరు భయపడాల్సిన పనిలేదు. మీకు ఉన్న అలవాట్లను బట్టి మీరు వెంటనే కొన్ని వైద్యపరీక్షలు చేయించుకుంటే క్యాన్సర్‌ వస్తుందా… రాదా అని చెప్పవచ్చు. మీకు ఆరోగ్యకరమైన అలవాట్లు, జీవనశైలి ఉంటే క్యాన్సర్‌ను జయించవచ్చు. ఒకవేళ చెడు అలవాట్లకు లోనైతే క్యాన్సర్‌బారిన పడే అవకాశాలు ఎక్కువ. అయితే అందరూ గుర్తించి, పాటించాల్సిన జాగ్రత్తలు కొన్ని ఉన్నాయి. అవి, పొగతాగే అలవాటు ఉంటే వెంటనే దాన్ని మానేయాలి ∙మద్యం తాగడం ఆరోగ్యానికి మంచిది కాదు. క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి, తాజా పండ్లు, కాయగూరలు, ఆకుకూరలు తినాలి. చిన్నప్పుడు ఇవ్వాల్సిన అన్ని రకాల వ్యాక్సిన్లను పిల్లలకు ఇవ్వాలి అంటున్నారు నిపుణులు.

Related posts

క్రమ శిక్షణ సంఘానికి నరేశ్ పై 9 పేజీల లేఖ… “మా”లో మళ్ళీ రచ్చ

vimala p

ఇసుక విధానంలో ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం

vimala p

ప్రపంచ కప్ : .. దీటుగానే జవాబిస్తున్న.. లంక బౌలర్లు..

vimala p