telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

2000వేల నోట్లు రద్దు చేయబడ్డాయా .. దాచుకున్నవన్నీ పారేయాల్సిందేనా..!

2000 note printing stopped

2016లో నోట్ల రద్దు తరువాత ఇప్పటికి కూడా ఆ వార్తలు వైరల్ అవుతూనే ఉన్నాయి. గత కొన్ని రోజులుగా ఆర్బీఐ 2000 రూపాయల నోట్లను రద్దు చేసే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. చాలా కాలం నుండి 2000 రూపాయల నోట్లు భవిష్యత్తులో కనిపించవని వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. అక్రమార్కులు బ్లాక్ మనీని దాచుకోవటానికి 2000 రూపాయల నోట్లు అవకాశం కల్పిస్తున్నాయనే వాదనలు, అభిప్రాయాలు ఎప్పటినుండో వ్యక్తమవుతున్నాయి. గత కొంత కాలంగా కొన్ని బ్యాంకులకు చెందిన ఏటీఎంలలో కూడా 2000 రూపాయల నోట్లు రావట్లేదు. మరోవైపు సోషల్ మీడియాలో నోట్లరద్దుకు సంబంధించిన వార్త ఒకటి వైరల్ అవుతోంది. 2020 జనవరి 1వ తేదీ నుండి ఆర్బీఐ కొత్త 1000 రూపాయల నోట్లను విడుదల చేయబోతుందని ఆర్బీఐ 2000 రూపాయల నోట్లను వెనక్కు తీసుకోబోతుందని వార్త వైరల్ అవుతోంది.

ఒకరు 50,000 రూపాయల వరకు మాత్రమే 2000 రూపాయల నోట్లను మార్చుకోగలరని డిసెంబర్ 31వ తేదీ తరువాత 2వేల రూపాయల నోట్లు రద్దు అవుతాయని వార్త సారాంశం. మరోవైపు ఒక ప్రముఖ ప్రైవేట్ బస్సు ఆపరేటర్ సంస్థ తమ సిబ్బందికి 2000 రూపాయల నోట్లను తీసుకోవద్దంటూ సర్కులర్ జారీ చేసింది. త్వరలో నోట్ల రద్దు జరగబోతుందని భావిస్తున్నందువలనే ఆ సంస్థ సర్కులర్ జారీ చేసిందని సమాచారం. ప్రముఖ ట్రావెల్స్ సంస్థ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ పేరు మీద సర్క్యులర్ జారీ అయింది. ఇప్పటికే 2000 రూపాయల నోట్లు ఉంటే ఆ నోట్లను ఖచ్చితంగా బ్యాంకుల్లో జమ చేయాల్సిందేనని సిబ్బందికి సంస్థ ఆదేశాలు జారీ చేసింది. ఈ సంవత్సరం చివరలో కానీ వచ్చే సంవత్సరం మొదట్లో కానీ 2000 రూపాయల నోట్ల రద్దు చేసే అవకాశం లేకపోలేదని ఆ సంస్థ భావిస్తోంది. ప్రభుత్వం, ఆర్బీఐ నోట్ల రద్దు చేసే అవకాశమే లేదని చెబుతున్నా ఇలాంటి వార్తలు వైరల్ అవుతూనే ఉండటం గమనార్హం.

Related posts