telugu navyamedia
సినిమా వార్తలు

కెప్టెన్ అమెరికాకు ఐరన్ మ్యాన్ గిఫ్ట్… చూసి తీరాల్సిందే…!

iron-man-and-captain-america

హాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు “అవెంజర్స్” చిత్రాలకు ఎంతోమంది అభిమానులు ఉన్నారు. సినీ అభిమానులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న “అవెంజర్స్-4” ట్రైలర్ తాజాగా విడుదలైంది. “అవెంజర్స్-4: ఎండ్ గేమ్” అనేది సినిమా పూర్తి టైటిల్. అవెంజర్స్ సిరీస్ లో ఇదే చివరి చిత్రమని ఇప్పటికే నిర్మాణసంస్థ ప్రకటించింది. ఆంథోనీ రుస్సో జాయ్ రుస్సోలు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం వచ్చే సంవత్సరం ఏప్రిల్ 26న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇక ఈ సిరీస్ లో నటించిన సూపర్ హీరోలంతా రియల్ లైఫ్ లో చాలా స్నేహంగా ఉంటారు. తాజాగా ఐరన్ మ్యాన్(రాబర్ట్ డౌనీ) తన టీమ్ మెట్ కెప్టెన్ అమెరికా(క్రిస్ ఎవాన్స్)కు కాస్ట్లీ గిఫ్ట్ ఒకటి ఇచ్చారు. 1967 కస్టమైజ్‌డ్ షెవ్రోలే కామేరో కారుని గిఫ్ట్ గా అందించారు. ఈ కారు ఖరీదు రూ.2 కోట్లు ఉంటుందని తెలుస్తోంది. ఈ కారు ఇంజిన్ చాలా పవర్ ఫుల్ అట. ఇంజిన్ మాగ్జిమం పవర్ 750 హెచ్ పీ. కారు స్టీరింగ్ పై కెప్టెన్ అమెరికా షీల్డ్ గుర్తు కూడా ఉంది. సెలబ్రిటీలు చాలా మంది తమ సహ నటీనటులకు ఖరీదైన బహుమతులు అందిస్తూ తమ ప్రేమను చాటుతుంటారు. అలాగే ఐరన్ మాన్ కూడా కెప్టెన్ అమెరికాపై తన ప్రేమను చాటారు.

Related posts