telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్ వార్తలు

టెస్ట్ క్రికెట్ : .. ఐర్లాండ్ పై .. బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించినట్టే ఆడిన ఇంగ్లాండ్..

irland least socre in entire test cricket

ఇంగ్లాండ్ మరియు ఐర్లాండ్ మధ్య టెస్ట్ సిరీస్ జరుగుతున్న నేపథ్యంలో పిచుక మీద బ్రహ్మాస్త్రం అన్నట్టే ఆట అమాంతం సాగటం విశేషం. ఇంగ్లాండ్ జట్టు తాజాగా జరిగిన టెస్టు మ్యాచ్ లో పసికూన ఐర్లాండ్ ను వణికించింది. లండన్ లోని లార్డ్స్ మైదానం వేదికగా జరిగిన ఏకైక టెస్టు తొలి ఇన్నింగ్స్ లో 23.4 ఓవర్లకు 85 పరుగులకే ఇంగ్లాండు జట్టు కుప్పకూలింది. ఐర్లాండ్ బౌలర్లు తమ అద్భుత ప్రదర్శనతో ఇంగ్లాండును తొలి ఇన్నింగ్స్ లో మట్టి కరిపించారు. టెస్టు చరిత్రలోనే ఇంగ్లాండు కు ఇది నాల్గో అత్యల్ప స్కోరు కాగా, అతి తక్కువ ఓవర్లకే ఒక ఇన్నింగ్స్ లో ఆలౌట్ కావడం ఇది ఐదోసారి.

ఇంగ్లాండు జట్టు బ్యాటింగ్ : డెన్లీ (23), స్టోన్(19), సామ్ కరన్(18), బర్న్స్ (6), రాయ్ (5), రూట్ రెండు పరుగులు చేయగా, బెయిర్ స్టో, మొయిన్ అలీ, వోక్స్ లు డకౌట్ అయ్యారు. ఇక, ఐర్లాండ్ బౌలింగ్ గురించి చెప్పాలంటే.. ముర్తాగ్-5, అడెయిర్- 3, రాన్ కిన్ -2 వికెట్లు తీసుకున్నారు.

Related posts