క్రైమ్ వార్తలు రాజకీయ వార్తలు వార్తలు

ఐఆర్‌సీటీసీ కేసులో…రబ్రీ దేవి, తేజస్వి యాదవ్‌లకు ఊరట!

IRCTC Scam, Court bail Rabri Devi, Bihar

ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ కుంభకోణం (ఐఆర్‌సీటీసీ) కేసులో మనీ లాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ భార్య రబ్రీదేవి, తనయుడు తేజస్వి యాదవ్‌కు ఊరట లభించింది. ఈ కేసులో ఈ ఇద్దరికీ ఢిల్లీ పటియాలా కోర్టు శుక్రవారం బెయిల్‌ మంజూరు చేసింది. వీరితో పాటు కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితులందరికీ కోర్టు బెయిలిచ్చింది. నిందితులు లక్ష రూపాయల వ్యక్తిగత పూచీకత్తు సమర్పించాలని కోర్టు ఆదేశించింది. కేసు తదుపరి విచారణను సెప్టెంబర్ 6వ తేదీకి వాయిదా వేసింది.

మరోవైపు లాలూ ప్రసాద్‌ యాదవ్‌కు సీబీఐ కోర్టు ప్రొడక్షన్‌ వారెంట్‌ జారీ చేసింది. పశుగ్రాస కుంభకోణం కేసుల్లో దోషిగా తేలిన క్రమంలో రాంచీ జైలులో శిక్ష అనుభవిస్తున్న బిహార్‌ మాజీ సీఎం లాలూ ప్రసాద్‌ నేడు కోర్టు ఎదుట హాజరు కాలేకపోయారు. దీంతో ఆయనను అక్టోబర్ 6న కోర్టుకు హాజరయ్యేలా ప్రొడక్షన్ వారెంట్‌ ‌జారీ చేయాలని పటియాలా కోర్టు ఆదేశించింది.కేంద్ర రైల్వేమంత్రిగా లాలూ ప్రసాద్ యాదవ్ ఉన్నప్పుడు 2005లో రాంచీ, పురీలో ఉన్న రెండు ఐఆర్‌సీటీసీ హోటళ్లను సుజాత హోటల్స్‌ అనే ప్రైవేటు కంపెనీకి అక్రమంగా కట్టబెట్టినట్లు సీబీఐ ఆరోపిస్తోంది.

Related posts

అక్టోబర్ లో “విజయవాడ – సింగపూర్” తొలి అంతర్జాతీయ విమానం…

jithu j

ప్రజాస్వామ్యానికి చీకటి రోజు : జానారెడ్డి

admin

రాష్ట్రపతికి ఇచ్చే గౌరవం ఇదా…!?

admin

Leave a Comment