telugu navyamedia
telugu cinema news trending

జైళ్లో ఇరానియ‌న్ స్టార్ కి కరోనా… బెయిల్ ఇచ్చేందుకు నిరాకరణ…

surjary-star

కరోనా మహమ్మారి కారణంగా సినీరంగానికి చెందిన పలువురు హాలీవుడ్ స్టార్స్ కరోనా బారిన పడగా మరికొందరు కన్నుమూశారు. తాజాగా మరో సెలబ్రిటీ కరోనా బారిన పడింది. ఇన్‌స్టాగ్రామ్ స్టార్‌గా పాపుల‌ర్ అయిన 22 ఏళ్ల స‌హర్ త‌బార్ కరోనా వైర‌స్‌బారిన‌ప‌డింది. ఇరానియ‌న్ స్టార్ అయిన ఈమె ప్ర‌స్తుతం టెహ్రాన్‌లోని సినా ఆసుపత్రిలో వెంటిలేటర్‌పై ఉంది. హాలీవుడ్ నటి ఏంజెలీనా జోలీలా తన రూపురేఖలను మార్చుకునేందుకు 50కిపైగానే సర్జరీలు చేయించుకుని అవి బెడిసికొట్టి వికృతంగా త‌యారు అయింది స‌హర్ త‌బార్. విచిత్రమైన రూపమే ఆమెను పాపులరిటీ తెచ్చింది. అయితే దైవదూషణ, హింసను ప్రేరేపించడం, యువకులను అవినీతికి ప్రోత్సహించడం, అక్రమ మార్గాల్లో ఆదాయాన్ని పొందడం వంటి పలు ఆరోపణలపై గతేడాది అక్టోబరులో తబార్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. జైలులో ఉన్న ఆమెకు కరోనా వైరస్ సోకినట్టు నిర్ధారణ కావడంతో వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు. కరోనా వైరస్‌తో బాధపడుతున్నప్పటికీ ఆమెకు బెయిల్ ఇచ్చేందుకు న్యాయమూర్తి నిరాకరించినట్టు ఇరాన్‌లోని మానవ హక్కుల సంఘం పేర్కొంది.

Related posts

ఫేస్ క్రీం వాడి .. కోమాలోకి.. జరభద్రం బిడ్డా..

vimala p

హర్యానా : .. స్వతంత్ర అభ్యర్థులు .. బీజేపీ వైపే..

vimala p

ఐపీఎల్ తరువాత .. వెకేషన్ లో ఆటగాళ్లు.. సరదాగా…

vimala p