telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

బాగ్దాద్‌ : … ప్రతీకార దాడులు ప్రారంభించిన .. ఇరాన్ ..

iran attacks on american army base in iraq

ఇరాన్‌ ప్రతీకార దాడులు ప్రారంభించింది.. ఇరాక్‌లోని రెండు అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్‌ బలగాలు క్షిపణులతో దాడికి దిగాయి. ఇరాక్‌లోని అమెరికా ఎయిర్‌బేస్‌ లక్ష్యంగా ఈ దాడులు జరిపింది. పశ్చిమ ఆసియా నుంచి అమెరికా తన బలగాలను వెనక్కి తీసుకోవాలని ఇరాన్‌ హెచ్చరించింది. ఇరాక్‌లోని ఆల్‌ అసద్‌, ఇర్బిల్‌ ఎయిర్‌బేస్‌లపై డజనుకుపైగా క్షిపణులతో ఇరాన్‌ విరుచుకుపడింది. ఈ దాడిలో అమెరికా సైనికులకు జరిగిన నష్టంపై ఇంకా స్పష్టత రాలేదు. ఎయిర్‌బేస్‌లపై దాడిని పెంటగాన్‌ ధ్రువీకరించింది. దాడిలో జరిగిన నష్టంపై అమెరికా అంచనా వేస్తోంది. ఇరాన్‌ క్షిపణి దాడులను అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ఖండించారు.

తాజా పరిస్థితులపై ట్రంప్‌ స్వయంగా సమీక్షిస్తున్నారని, సరైన సమయంలో బదులిస్తామని అమెరికా రక్షణశాఖ ప్రకటించింది. దాడులపై పూర్తి నివేదికను ట్రంప్‌కు సమర్పించామని, ఆయన తదుపరి చర్యలు తీసుకుంటారని వైట్‌ హౌస్‌ వెల్లడించింది. ఇరాన్‌ దాడుల నేపథ్యంలో ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు తీవ్ర రూపం దాల్చే పరిస్థితి కనిపిస్తోంది.

Related posts