telugu navyamedia
sports trending

ఐపీఎల్ వేడుకలు రద్దు.. పుల్వామా బాధిత కుటుంబాలకు ఆ నగదు.. : సీఓఏ చైర్మన్ వినోద్ రాయ్

ipl opening ceremony funds to pulwama effects

కాశ్మీర్ లో జరిగిన ఉగ్రదాడిపై పలువురు స్పందిస్తున్నారు. ఇప్పటికే ఐక్యరాజ్యసమితిలో కూడా సదరు ఉగ్రవాద సంస్థ అధినేతను అంతర్జాతీయ తీవ్రవాదిగా ప్రకటించింది. భారత్ కూడా పాక్ పై సహాయనిరాకరణ ఉద్యమం చేపడుతుంది. దాదాపు దేశం అంతటా తీవ్రంగా నిరసనలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో కొద్దీ రోజులలో జరగాల్సిన ఐపీఎల్ 12వ ఎడిషన్ ఓపెనింగ్ సెర్మనీ రద్దు చేయాలని బీసీసీఐ నిర్ణయించింది. ఈ సెర్మనీ కోసం వెచ్చించే డబ్బును దాడిలో చనిపోయిన జవాన్ల కుటుంబాలకు ఇవ్వనున్నట్లు సీఓఏ చైర్మన్ వినోద్ రాయ్ వెల్లడించారు.

బీసీసీఐ, సీఓఏ అధికారులు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సమావేశంలోనే ప్రారంభ వేడుకలకు వెచ్చించే నగదును పుల్వామా బాధిత కుటుంబాలకు ఇవ్వాలనే నిర్ణయానికి వచ్చారు. ఈ నిర్ణయం నాకు చాలా ఆనందాన్నిచ్చింది. అమర వీరుల ప్రాణాలను తిరిగి తీసుకురాలేం. కానీ ఓ సంస్థగా ఆ అమరవీరుల కుటుంబాల బాధ్యతను తీసుకోవాలని భావించాం అని బీసీసీఐ అధికారి ఒకరు వెల్లడించారు.

Related posts

తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు శుభలేఖ ఇవ్వనున్న రానా

vimala p

పూజా హెగ్డే నడుముపై దర్శకేంద్రుడి చమత్కారం… సంచలనంగా మారిన వ్యాఖ్యలు

vimala p

నా నడుం పట్టుకోవాలని చూశాడు… వేలు విరిచేశా… : తాప్సి

vimala p