telugu navyamedia
క్రీడలు

ప్రారంభ‌మైన ఐపీఎల్ 2022 మెగా వేలం..

ఐపీఎల్ 2022 మెగా వేలం రెండో రోజు ప్రారంభ‌మైంది. రెండో రోజు వేలాన్ని ఐపీఎల్ చైర్మన్ బ్రిజేష్ పటేల్ ప్రారంభించారు. రెండో రోజు వేలం పాట జోరుగా జరుగుతోంది. మొత్తం10 ఫ్రాంచైజీలు భారతీయ, విదేశీ ఆటగాళ్ల కోసం అధికంగా ఖర్చు చేశాయి.

రెండో రోజు వేలంలోకి వచ్చిన తొలి ఆటగాడు దక్షిణాఫ్రికా బ్యాటింగ్ ఆల్‌రౌండర్ ఎయిడెన్​ మార్క్రామ్​. కోటి రూపాయల బేస్​ ప్రైజ్​ ఉన్న ఇతడ్ని.. రూ. 2.60 కోట్లకు సన్​రైజర్స్​ హైదరాబాద్ దక్కించుకుంది. ఇతడు గత సీజన్​లో పంజాబ్ కింగ్స్‌లో ఆడాడు.

తమిళనాడు ఆల్‌రౌండర్ విజయ్ శంకర్‌ను రూ.1.4 కోట్లతో గుజరాత్ టైటాన్స్ దక్కించుకుంది.

భారత స్పిన్నర్ ఆల్ రౌండర్ జయంత్ యాదవ్‌ను ఆల్‌రౌండర్ జయంత్ యాదవ్‌ను రూ.1.7 కోట్లతో గుజరాత్ టైటాన్స్ దక్కించుకుంది.గత సీజన్ వరకు జయంత్ ముంబైలో భాగంగా ఉన్నాడు.

వెస్టిండీస్ ఆల్‌రౌండర్ డొమినిక్ డ్రేక్స్‌ను రూ.1.1 కోట్లతో గుజరాత్ టైటాన్స్ కొనుగోలు చేసింది.డ్రేక్స్ తొలిసారి ఐపీఎల్‌లో భాగం కానున్నారు.

భారత బ్యాటర్ మన్‌దీప్ సింగ్‌ను రూ.1.1 కోట్లతో ఢిల్లీ క్యాపిటల్స్ దక్కించుకుంది.

భారత బ్యాటర్ అజింక్య రహానేను రూ.కోటితో కోల్‌కతా నైట్‌రైడర్స్ దక్కించుకుంది.

ఆల్‌రౌండర్ జయంత్ యాదవ్‌ను రూ.1.7 కోట్లతో గుజరాత్ టైటాన్స్ దక్కించుకుంది.

ఇంగ్లండ్‌కు చెందిన బ్యాట్స్‌మెన్, పార్ట్‌టైమ్ లెగ్ స్పిన్నర్ లియామ్ లివింగ్‌స్టన్11.50 కోట్లకు పంజాబ్ కింగ్స్ కొనుగోలు చేసింది.

మరి ఈ రోజు జాక్​పాట్​ కొట్టేది ఎవరు? ఇషాన్​ కిషన్​ను ఎవరైనా అధిగమిస్తారా? ఫ్రాంఛైజీలు ఏయే ఆటగాళ్లపై ఎంత ఖర్చు చేయనున్నాయి అనేది ఆస‌క్తిక‌రంగా మారింది.

కాగా ఐపీఎల్ 2022 మెగా వేలం మొద‌టి జోరుగా సాగింది. మొత్తం10 ఫ్రాంచైజీలు భారతీయ, విదేశీ ఆటగాళ్ల కోసం అధికంగా ఖర్చు చేశాయి. ఇషాన్ కిషన్ రూ.15.25 కోట్ల‌ అత్యంత ఖరీదైన ఆటగాడిగా మారాడు.

Related posts