telugu navyamedia
క్రీడలు

ఆసియా కప్ జరగాల్సిందే : పాకిస్థాన్ క్రికెట్ బోర్డు

pcb

ఐపీఎల్ కోసం ఆసియా కప్‌ను రద్దు చేస్తే ఊరుకునేది లేదని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ ఎహ్సన్ ఇండియాపై నిప్పులు చెరిగాడు. వాస్తవానికి మార్చి 29న ఐపీఎల్ మొదలు కావాల్సి ఉండగా కరోనా వైరస్ కారణంగా అది కాస్తా నిరవధిక వాయిదా పడింది. అయితే నిజానికి సెప్టెంబర్‌లో దుబాయ్ వేదికగా ఆసియా కప్‌కు పాక్ ఆతిద్యం ఇవ్వనుంది. దీనితో ఐపీఎల్ కోసం ఈ టోర్నీని వాయిదా వేయమని ఎహ్సన్ తేల్చి చెప్పాడు. ‘సెప్టెంబర్‌లో ఐపీఎల్ నిర్వహిస్తారని వస్తోన్న వార్తలు గురించి విన్నాను. ఆసియా కప్ నిర్వహణపై కేవలం భారత్, పాక్ దేశాలు నిర్ణయం తీసుకుంటే సరిపోదు. అంతేకాక ఆ సమయంలో ఆసియా కప్ నిర్వహణ ఎంతో ముఖ్యమైనది. ఈ టోర్నీ ద్వారా వచ్చే నిదులపైనే ఆసియా క్రికెట్ అభివృద్ధి ఆధారపడి ఉంది. అటు ఆసియా క్రికెట్ కౌన్సిల్ సభ్య దేశాల క్రికెట్ అభివృద్ధికి కూడా ఈ నిధులు ఎంతో అవసరం. మరోవైపు ఈ ఏడాది ఆస్ట్రేలియా వేదికగా జరగాల్సిన టీ20 ప్రపంచకప్ కూడా జరగకపోతే దేశాలు ఆర్ధికంగా నష్టపోతాయని ఎహ్సన్ అన్నారు.

Related posts